
భానుచందర్
భానుచందర్, జీవా, అదిరే అభి, ఫణి ముఖ్య తారలుగా జంగాల నాగబాబు దర్శకత్వంలో మెట్రో క్రియేషన్స్ పతాకంపై దమిశెల్లి రవికుమార్, మొహ్మద్ ఖలీల్ నిర్మించిన ‘వస్తా’ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. ‘‘హారర్ కామెడీ చిత్రమిది. చిన్న చిత్రాలుగా విడుదలై పెద్ద విజయాలను సొంతం చేసుకున్నాయి హారర్ కామెడీ చిత్రాలు.
ఆ నమ్మకంతోనే ఈ సినిమా చేశాం. ఈ నెలలోనే పాటలను విడుదల చేస్తాం. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన భానుచందర్ సహకారం మరువలేనిది’’అన్నారు నిర్మాతలు. రఘువర్మ, నాగేంద్ర, అబ్దుల్ రజాక్, రేణుక తదితరులు నటించిన ఈ సినిమాకు కెమెరా: వాసిరెడ్డి సత్యానంద్. సహ నిర్మాత: రేలంగి కనకరాజు.
Comments
Please login to add a commentAdd a comment