
జీవాతో మరోసారి నయన
యువనటుడు జీవాతో మరోసారి జోడి కట్టడానికి నటి నయనతార రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం. వీరిద్దరూ కలసి ఇంతకుముందు ఈ అనే చిత్రంలో నటించారు.
యువనటుడు జీవాతో మరోసారి జోడి కట్టడానికి నటి నయనతార రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం. వీరిద్దరూ కలసి ఇంతకుముందు ఈ అనే చిత్రంలో నటించారు. ఆ చిత్రం విజయం సాధించింది. అలాంటి హిట్ పెరుుర్ మరోసారి కలిసి నటించడానికి సిద్ధం అవుతున్నారన్నది కోలీవుడ్ టాక్. ఈ అవకాశాన్ని జీవాకు నటుడు విజయ్ కల్పించినట్టు సమాచారం. ఇంతకుముందు ఇళయదళపతితో ఒక భారీ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత తాజాగా ఆయనతోనే మరో చిత్రం నిర్మించాలని తలచారట.
అయితే ప్రస్తుతం కమిటైన చిత్రాలతో విజయ్ బిజీగా ఉండటంతో ముందు జీవా హీరోగా ఒక చిత్రం చేయండి. ఆ తరువాత మనం కలిసి చిత్రం చేద్దాం అని విజయ్ ఆ నిర్మాతకు సలహా ఇచ్చారని సమాచారం. ఇటీవల విడుదలైన యాన్ చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడంతో నిరాశకు గురైన నటుడు జీవాకు ఇది అనుకోని అవకాశంగా మారింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న నయనతార హీరోయిన్‌గా తనతో మరోసారి జత కట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జీవా మంచి హుషారుగా ఉన్నారని టాక్. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడనున్నట్లు తెలుస్తోంది.