అసిస్టెంట్ డెరైక్టర్‌తో ప్రేమాయణం! | Love affair with assistant director | Sakshi
Sakshi News home page

అసిస్టెంట్ డెరైక్టర్‌తో ప్రేమాయణం!

Published Tue, Mar 11 2014 11:25 PM | Last Updated on Sat, Sep 2 2017 4:35 AM

అసిస్టెంట్ డెరైక్టర్‌తో ప్రేమాయణం!

అసిస్టెంట్ డెరైక్టర్‌తో ప్రేమాయణం!

అతనో అసిస్టెంట్ డెరైక్టర్. పక్కా స్త్రీ ద్వేషి. మొదట్నుంచీ ఎందుకనో అమ్మాయిలకు చాలా దూరంగా ఉంటుంటాడు. అలాంటి వాడికి ఓ కథానాయికతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. అతనిలో తన ప్రేమతో మార్పు తీసుకొస్తుందా కథానాయిక. ఈ నేపథ్యంలో తమిళంలో రూపొందిన చిత్రం ‘ఎండ్రెండ్రుం పున్నగై’. హీరోయిన్‌గా త్రిష, అసిస్టెంట్ డెరైక్టర్‌గా జీవా నటించారు. అహ్మద్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తమిళంలో ఘనవిజయం సాధించింది. దీన్ని తెలుగులో ‘చిరునవ్వుల చిరుజల్లు’ పేరుతో అనువదిస్తున్నారు వి.ఎస్. రామిరెడ్డి జాని. ఈ నెలలో పాటలను, వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: హేరిస్ జైరాజ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బ్రహ్మస్వామి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement