Ahmed
-
‘అహ్మద్‌కు రీనా లేఖ’.. మూడవ తరగతి లెసన్‌పై పోలీసులకు ఫిర్యాదు
ఛతర్పూర్: మధ్యప్రదేశ్‌లోని ఛతర్పూర్ జిల్లాలో మూడవ తరగతి చదువుతున్న ఓ బాలిక తండ్రి ఎన్సీఈఆర్టీ పుస్తకంలోని ఓ పాఠ్యాంశంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ఓ లెసన్‌ను ‘లవ్ జిహాద్’గా పేర్కొంటూ, ఎన్సీఈఆర్టీపై పలు ఆరోపణలు గుప్పిస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేశారు.వివరాల్లోకి వెళితేడాక్టర్ రాఘవ్ పాఠక్ కుమార్తె ఎన్సీఈఆర్టీ బోర్డు పాఠ్యాంశాలు బోధించే పాఠశాలలో హిందీ మీడియంలో మూడవ తరగతి చదువుతోంది. ఆ చిన్నారికి సంబంధించిన పర్యావరణ సబ్జెక్ట్‌లోని 17వ లెసన్ ‘చిట్టీ ఆయీ హై’ పేరుతో ఉంది. ఇందులో రీనా అనే అమ్మాయి తన స్నేహితుడైన అహ్మద్‌ను సెలవుల్లో అగర్తలాకు రమ్మని ఆహ్వానిస్తూ లేఖ రాస్తుంది. ఈ లేఖ చివరిలో ‘నీ రీనా’ అని రాస్తుంది. దీనిని గుర్తించిన డాక్టర్ రాఘవ్ పాఠక్ ఈ లెసన్ ‘లవ్ జిహాద్’ మాదిరిగా ఉందని ఆరోపించారు. అలాగే ఈ లేఖ లవ్ జిహాద్‌కు ఊతమిస్తుందంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.ఒక హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయికి లేఖ రాయడం, పైగా చివరిలో ‘నీ రీనా’ అని రాయడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ లేఖను చదివిన పిల్లల మదిలో లవ్ జిహాద్‌పై ఆకర్షణ పెరుగుతుందని, భవిష్యత్తులో లవ్ జిహాద్ లాంటి ఘటనలు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. లవ్ జిహాద్ లాంటి ఘటనలను అరికట్టేందుకు ఒకవైపు ప్రభుత్వం కఠిన చట్టాలు చేస్తుండగా, ఎన్సీఈఆర్టీకి చెందిన ఈ పుస్తకం లవ్ జిహాద్‌ను ప్రోత్సహిస్తున్నట్లున్నదని ఆయన ఆరోపించారు.ఈ పుస్తకంలోని 17వ లెసన్‌లో అహ్మద్- రీమా లేఖను తక్షణం మార్చాలని లేదా తొలగించాలని తాను కోరుకుంటున్నానని, తన కుమార్తె ఈ లెసన్ చదివాక ఆమె మనసులో ఎలాంటి తప్పుడు భావన తలెత్తకూడదని భావిస్తున్నానని ఆయన అన్నారు. ఈ విషయమై ఖజురహో పోలీసు అధికారి సునీల్ శర్మ మాట్లాడుతూ ఎన్సీఈఆర్టీ పర్యావరణ పుస్తకంలోని ఒక లెసన్ లవ్ జిహాద్‌ను ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తూ వచ్చిన ఫిర్యాదును సీనియర్ అధికారులకు పంపినట్లు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.ఇది కూడా చదవండి: రైలు పట్టాలపై సిలిండర్.. బయటపడిన మరో కుట్ర -
బాబు అవకాశవాద రాజకీయాలు ఇక చెల్లవు
సాక్షి, అమరావతి: చంద్రబాబు మళ్లీ బీజేపీతో పొత్తుపెట్టుకుని మాయమాటలు చెబుతున్నాడని, ఆయన అవకాశవాద రాజకీయాలు ఇక చెల్లవని ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) రాష్ట్ర కన్వినర్ షేక్ మునీర్ అహ్మద్ చెప్పారు. చంద్రబాబు తీరును తప్పుబడుతూ మునీర్ అహ్మద్ మంగళవారం సాక్షితో మాట్లాడారు. సొంత అవసరం, అవకాశాన్ని బట్టి పార్టీలతో పొత్తులు పెట్టుకునే చంద్రబాబు ముస్లిం మైనార్టీలను మాయమాటలతో మోసం చేస్తూ వచ్చారన్నారు. ప్రతిసారి బీజేపీతో పొత్తుపెట్టుకోవడం, ఇంకెప్పుడూ మళ్లీ బీజేపీతో పొత్తుపెట్టుకోనని నమ్మబలకడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని విమర్శించారు. మళ్లీ ఇప్పుడు యూటర్న్ తీసుకుని బీజేపీ, జనసేనతో పొత్తుపెట్టుకుని సిగ్గులేకుండా జనం ముందుకు వస్తున్నాడన్నారు. చంద్రబాబు జీవితం మొత్తం నైతిక విలువలు లేని స్వార్థ రాజకీయ చరిత్రేనని చెప్పారు. ఈ అనైతిక పొత్తును ప్రజలు తిరస్కరిస్తున్నారన్నారు. ఎన్నికల అనంతరం టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీలో విలీనం కావడం ఖాయమని చెప్పారు. చంద్రబాబు తొలినుంచి ముస్లిం ఓట్లు రాబట్టుకుని వారిని ధోకా (మోసం) చేయడం అలవాటుగా మారిందన్నారు. బీజేపీతో జట్టుకట్టిన చంద్రబాబు వివక్షపూరిత స్వభావం కలిగిన సీఏఏ బిల్లుకు మద్దతు తెలపడం స్వార్థ రాజకీయాలకు నిదర్శనమని చెప్పారు. మైనారిటీలకు పదవులు ఇవ్వలేదని ప్రశ్నించిన ముస్లిం సోదరులపై చంద్రబాబు దేశద్రోహం కేసులు పెట్టించిన దురాగతాలను ముస్లిం సమాజం మరచిపోలేదన్నారు. చంద్రబాబు ముస్లింలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేశారన్నారు. ఐదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం ముస్లింల కోసం రూ.3,495 కోట్లు కేటాయిస్తే.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లలో రూ.23 వేల కోట్లు ముస్లిం సంక్షేమానికి ఖర్చు చేసిందని చెప్పారు. ముస్లింలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఇచ్చిన నాలుగుశాతం రిజర్వేషన్లను కొనసాగిస్తున్న సీఎం జగన్ ముస్లిం మైనార్టీలకు ఇళ్లస్థలాలు, ఇళ్లు, అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారని వివరించారు. ముస్లింలకు ఇచ్చిన నాలుగుశాతం రిజర్వేషన్లు తొలగిస్తామని చెబుతున్న బీజేపీతో పొత్తుపెట్టుకున్న చంద్రబాబు ముస్లింలను దగాచేయడానికి జట్టుకట్టారని మండిపడ్డారు. ముస్లింలకు ఉప ముఖ్యమంత్రి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌తోపాటు అనేక రాజకీయ అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించిన సీఎం జగన్ ప్రస్తుత ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ స్థానాలు కేటాయించి అండగా నిలిచారని గుర్తుచేశారు. ముస్లింలలో వ్యతిరేకతను గమనించిన చంద్రబాబు కొందర్ని చుట్టూ పెట్టుకుని మళ్లీ మభ్యపెట్టే మాటలు మాట్లాడుతున్నారన్నారు. గత అనుభావాలను దృష్టిలో పెట్టుకుని ముస్లిం సమాజం చంద్రబాబు జిమ్మిక్కులను నమ్మేస్థితిలో లేదని, సీఎం జగన్‌కే ముస్లింల మద్దతు దక్కుతుందని మునీర్ అహ్మద్ స్పష్టం చేశారు. -
కంప్యూటర్ మాయం
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యామండలికి సంబంధించి కీలకమైన డేటా ఉన్నట్టు భావిస్తున్న కంప్యూటర్ కనిపించకుండాపోయింది. 2014 నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లోని ఫైళ్లు యథాతథంగా ఉంచాలని సీఎస్ ఆదేశించిన రోజే ఈ ఘటన జరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. దీనిపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇస్తామని మండలి వైస్‌చైర్మన్(వీసీ) అహ్మద్ తెలిపారు. ఏం జరిగిందో పరిశీలిస్తున్నామని మండలి కార్యదర్శి శ్రీనివాస్ చెప్పారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణను ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. వైస్ చైర్మన్ వెంకటరమణ బాసర ట్రిపుల్ ఐటీ ఇన్చార్జ్ వీసీగా కూడా ఉన్నారు. ఈ కారణంగా ఆయన మండలి కార్యాలయానికి వచ్చి పోతున్నట్టు సిబ్బంది చెబుతున్నారు. అందులో ఏముందో...? కీలకమైన ఫైళ్లు స్టోర్ చేసేందుకు అత్యాధునిక సాంకేతిక సామర్థ్యమున్న కంప్యూటర్ను 2017లో కొనుగోలు చేశారు. అయితే, గత ఏడాది నుంచి అది పనిచేయడం లేదని కొందరు అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగానే దీనిని స్క్రాప్‌గా నమోదు చేసి, స్టోర్ రూంలో ఉంచామంటున్నారు. దీని స్థానంలో వేరే కంప్యూటర్ కొనుగోలు చేసినట్టు అధికారులు తెలిపారు. అయితే ఫైళ్లు భద్రపరచాలన్న ఆదేశాలొచ్చిన రోజు కంప్యూటర్ కనిపించడం లేదని అధికారులు వీసీ అహ్మద్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆయన హడావిడిగా సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. అసలు అందులో ఏముంది? పనిచేయకపోయినా పాత డేటా హార్డ్ డిస్్కలో ఉండే అవకాశం లేదా? హార్డ్‌డిస్క్ ఎక్కడుంది? అందులో డేటాను ఏం చేశారు? పనికి రాని కంప్యూటర్ తీసుకెళ్లాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని సిబ్బందిని కోరారు. అయితే, ఈ సమావేశానికి మండలి కార్యదర్శి హాజరుకాలేదని చెబుతున్నారు. దోస్త్ డేటా ఉన్నట్టేనా? ఆన్లైన్ ద్వారానే ఉన్నత విద్యామండలి డిగ్రీ ప్రవేశాలను భర్తీ చేస్తుంది. ఈ డేటా అంతా కంప్యూటర్లో పొందుపరుస్తారు. దీంతోపాటు మండలి ఆదేశాలు, డిగ్రీ కాలేజీల అనుమతులు ఇందులో ఉంటాయి. ప్రొఫెసర్ లింబాద్రి వీసీ–1గా ఉన్నప్పుడు, వెంకటరమణ వీసీ–2గా ఉన్నారు. లింబాద్రి మండలి చైర్మన్ అయిన తర్వాత అహ్మద్‌ను మండలి వైస్‌చైర్మన్‌గా నియమించారు. ఈ నేపథ్యంలో వెంకటరమణ వీసీ–2 నుంచి వీసీ–1 మారుస్తూ అప్పటి విద్యాశాఖ కార్యదర్శి ఉత్తర్వులిచ్చారు. ఇది మండలిలో తీవ్ర వివాదానికి దారి తీసింది. వీసీ–1, వీసీ–2 మధ్య రగడ తారస్థాయికి చేరింది. ఈ సమయంలోనే దోస్త్ వ్యవహారాలపై ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం మారడం, వీసీ–1గా ఉన్న వెంకటరమణను తీసేయడం, ఇదే సమయంలో దోస్త్‌కు సంబంధించిన కంప్యూటర్ మాయం కావడం అనేక అనుమానాలు రేకెత్తిస్తోంది. ఇంతకీ దోస్త్ మొదలైనప్పట్నుంచీ డేటా ఉందా? అనే సందేహం మండలివర్గాల నుంచే వినిపిస్తోంది. -
అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్
మలక్‌పేట: బీఆర్ఎస్ స్టీరింగ్ సీఎం కేసీఆర్ చేతిలోనే ఉందని, ఎంఐఎం స్టీరింగ్ అసదుద్దీన్ చేతిలోనే ఉందని.. కానీ బీజేపీ స్టీరింగ్ మాత్రం వ్యాపారవేత్త అదానీ చేతిలో ఉందని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు విమర్శించారు. ప్రధాని మోదీ చేతుల్లో ఏమీ లేదని, అదానీ చెప్పినట్టే నడుచుకుంటున్నారని ఆరోపించారు. మలక్‌పేట ప్రభుత్వ క్వార్టర్స్‌లో ఐటెక్ న్యూక్లియస్ ఐటీ టవర్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాలాతో కలసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. మలక్‌పేటలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన ఐటీ టవర్‌ను నిర్మించనున్నామని, దీనితో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 25 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఇందులో తొలి విడతగా 10.35 ఎకరాల్లో రూ.1,032 కోట్లతో 21 అంతస్తులతో 15లక్షల చదరపు అడుగుల ఐటీ టవర్ నిర్మిస్తున్నామన్నారు. ఒకప్పుడు మలక్‌పేట అంటే టీవీ టవర్ గుర్తుకువచ్చేదని.. ఇప్పుడు ఐటీ టవర్ ఐకాన్ మారుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్ ఐటీ రంగంలో దూసుకెళ్తోందని, వరుసగా రెండేళ్లపాటు బెంగళూరు కంటే అధికంగా ఐటీ ఉద్యోగాలను కల్పిస్తోందని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం, హైదరాబాద్ ప్రశాంతంగా ఉన్నాయన్నారు. గణేశ్ నిమజ్జనాన్ని పురస్కరించుకుని ముస్లింలు మిలాద్ ఉన్ నబీ ఊరేగింపును వాయిదా వేసుకున్నారని.. హైదరాబాద్‌కే ప్రత్యేకమైన గంగా జమునా తెహజీబ్ సంస్కృతికి అద్దం పట్టారని పేర్కొన్నారు. కాగా.. కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని, ఆయన సారథ్యంలో తెలంగాణ, హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందాయని ఎంపీ అసదుద్దీన్ చెప్పారు. -
ఏదైనా సాధిస్తేనే ఇంటికిరా ... షాబాజ్ అహ్మద్ కు " తండ్రి వార్నింగ్ "
-
ఆరుగురు కూతుళ్లు అందరూ డాక్టర్లు
ఆ తల్లి ఏమీ చదువుకోలేదు. ఆ తండ్రీ మామూలు తండ్రే. కాని కూతురు పుట్టడం శుభసూచకం అని తెలిసేంత తెలివి వారికుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఆరుమంది కుమార్తెలు పుట్టారు. ఆడపిల్లకు చదువుకు మించిన ధైర్యం లేదని ఆ తల్లిదండ్రులు వారిని చదివించారు. ఒకరు కాదు ఇద్దరు కాదు... ఆరుగురూ డాక్టర్లు అయ్యారు. ఆడపిల్ల విషయంలో పాతకాలపు భావాలున్న వారికి వీరి వైద్యం తప్పనిసరి కదూ. ‘నేను వరుసపెట్టి ఆడపిల్లలను కంటుంటే ఊళ్లో అందరికీ కంగారే. ఆ పిల్లల పరిస్థితి ఏం కాను. వాళ్ల పెళ్లిళ్లు ఎలా కాను అని. పెళ్ళిళ్లేమిటి... వాళ్లు ముందు చదువుకోవాలి కదా’ అంటుంది ఆరుగురు కుమార్తెలను కని, వారిని డాక్టర్లను చేసిన జైనా. పిల్లల ప్రయోజకత్వాన్ని చూడటానికి భర్త ఉంటే బాగుండునని ఆమె అనుకుంటుంది గాని ఆయన మరణించి ఆరేడేళ్లు అయిపోతోంది. అతని పేరు అహమద్. వారిది కోజికోడ్ జిల్లాలోని నాదపురం అనే చిన్న పల్లె. ‘నాకు పన్నెండు పెళ్లయ్యేటప్పటికి. ఐదో క్లాసుకే చదువు మాన్పించి ఇంట్లో కూచోబెట్టి పెళ్లి చేశారు. మా ఆయన నాకు బంధువే. అతను మద్రాసులో ఉద్యోగం చేసేవాడు. నాకు బాగా చదువుకోవాలని ఉండేది. ఆ తర్వాత సంసారంలో పడ్డాను. మద్రాసు నుంచి మేము కతార్ వెళ్లాం. అక్కడ నా భర్త ఒక ఆయిల్ కంపెనీలో పని చేసేవాడు. అక్కడే మా ఆరుమంది అమ్మాయిలు చదువుకున్నారు’ అంటుంది జైనా. అహమద్‌కు డాక్టర్ కావాలని ఉండేదట. కాని కాలేకపోయాడు. తమ్ముణ్ణి చేద్దామని అనుకుంటే ఆ తమ్ముడు టీచర్ అయ్యాడు. పిల్లలు డాక్టర్లు అయితే చూడాలనుకున్నాడు. జైనా కూడా అదే చెప్పింది. ‘నేను ఎలాగూ చదువుకోలేకపోయాను. పిల్లల్ని ఇద్దరం చదివిద్దాం’ అంది. ఇక అప్పటి నుంచి ఆ భార్యాభర్తలు తమ ప్రతి పైసా పిల్లల చదువుకు ఉపయోగించేవారు. ‘సాయంత్రం స్కూళ్లు అయ్యి పిల్లలు ఆడుకునే మూడ్‌లో ఉంటే పిలిచి ఒకటే మాట చెప్పేదాన్ని– మీరంతా బాగా చదువుకోవాలి. అందులో రాజీ లేదు అని’ అంటుంది జైనా. ఇంకో సంగతి ఏమిటంటే ఆ ఆరుమంది ఆడపిల్లలను కన్న అహమద్‌కు లోకజ్ఞానం, పుస్తక జ్ఞానం ఎక్కువ. నా పిల్లలు పుస్తకాలు బాగా చదవాలి అని రకరకాల పుస్తకాలు తెచ్చి ఇచ్చేవాడు. అలా వారికి చదువు మీదే కాక జనరల్ నాలెడ్జ్‌లో కూడా పరిణితి ఉండేలా చేశాడు. ఆరుమంది ఆడపిల్లల్లో ఇప్పుడు డాక్టర్ ఫాతిమా అహమద్ (39), హాజరా అహమద్ (33), ఆయిషా అహమద్ (30), ఫైజా అహమద్ (28) ఇప్పటికే వైద్యులుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. రీహానా అహమద్ (23) ఫైనలియర్ ఎంబిబిఎస్ చేస్తోంది. అమీరా అహమద్(19) మొదటి సంవత్సరం ఎంబిబిఎస్‌లో ఉంది. ‘మొదట నేను మెడిసిన్ చేశాను. అదేం పెద్ద విషయం కాదని నా చెల్లెళ్లకు చెప్పాను. వారు వరుస అందుకున్నారు’ అంటుంది పెద్ద కూతురు ఫాతిమా అహమద్. ఈమె అబూదాబిలోని మిలట్రీ హాస్పిటల్లో పని చేస్తోంది. ‘కతర్ నుంచి మేము ఇండియాకు తిరిగొచ్చేసి రెండేళ్లు గడిచేసరికి ఇద్దరు అమ్మాయిలకు పెళ్లి చేశాం. నా భర్తకు అంత అదృష్టమే ఉంది. ఆయన హార్ట్ ఎటాక్‌తో పోయారు’ అంది జైనా. అయితే భర్త చనిపోయినా ఆమె తన సంకల్పాన్ని వదల్లేదు. మిగిలిన కూతుళ్లను మెడిసిన్ చదివించాల్సిందే అనుకుంది. ‘నా మూడో కుమార్తె మాత్రం లా చేయాలని అనుకుంది. లా చేస్తే నీ భర్త ప్రాక్టీసు చేయించొచ్చు. మాన్పించవచ్చు. కాని మెడిసిన్ చేస్తే తప్పకుండా ప్రాక్టీస్ చేయించే అవకాశం ఉంది. డాక్టర్ని ఎవరు ఖాళీ పెడతారు అని సలహా ఇచ్చేసరికి మెడిసిన్ చేసింది’ అంది జైనా. ఈ తల్లి పాటించిన మరో గొప్ప ఆదర్శం ఏమిటంటే అమ్మాయిలకు కట్నం ఇవ్వకూడదు అని. ఏ సంబంధం వచ్చినా ‘నా పిల్లల్ని అమ్మకానికి పెట్టలేదు. నేను కట్నం ఇవ్వను’ అని కచ్చితంగా చెప్పేసిందామె. ఇంకో విషయం డాక్టర్లకే ఇచ్చి చేస్తే ఇద్దరూ ఒకే రంగం కనుక ఒకరి సాధక బాధకాలు తెలుస్తాయని కూడా అనుకుంది. ఇప్పటికి పెళ్లయిన నలుగురి భర్తలూ డాక్టర్లే. పండక్కి పబ్బానికి అందరూ కలిస్తే తన ఆరుగురు కూతుళ్లను చూసుకుని ఆ తల్లి గుండె పొంగిపోతుంది. ‘నా పిల్లలు సమాజానికి సేవ చేస్తున్నారు’ అని గర్వంగా ఇరుగు పొరుగు వారితో అంటుంది. కాకుంటే ఒకటే లోటు. ఆ ఆరుగురు ఆడపిల్లలు తండ్రితో కలిసి దిగిన ఫొటో ఒక్కటీ లేదు. ‘ఏం పర్వాలేదు. ఆయన మా గుండెల్లో ఉన్నారు’ అంటారా ఆడపిల్లలు. నిజంగా వారిని కన్న తల్లిదండ్రులు ధన్యులు. కంటే కూతుర్నే కనాలి అని వీరు చెబుతున్నారు. అందరూ వినాల్సిన మాటే కదా అది. ఈ తల్లి పాటించిన మరో గొప్ప ఆదర్శం ఏమిటంటే అమ్మాయిలకు కట్నం ఇవ్వకూడదు అని. ఏ సంబంధం వచ్చినా ‘నా పిల్లల్ని అమ్మకానికి పెట్టలేదు. నేను కట్నం ఇవ్వను’ అని కచ్చితంగా చెప్పేసిందామె. -
చిక్కినా చిక్కులే!
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణతో పాటు మహారాష్ట్రలో ఒకే పంథాలో వరుస మోసాలకు పాల్పడుతున్న ‘గ్రేట్ చీటర్’ అఫ్తాబ్ అహ్మద్ షేక్ చిక్కడం ఒక ఎత్తయితే... అతడిని విచారించడం మరో ఎత్తు. ఇంటరాగేషన్ చేయడానికి ప్రయత్నించే పోలీసులకు చుక్కలు చూపిస్తుంటాడు. మరోపక్క ఈ ఘరానా నేరగాడు అనేక సందర్భాల్లో ‘ప్లీడెడ్ గిల్టీ’ విధానం అనుసరించినట్లు పోలీసులు తెలిపారు. సేల్స్ ఎగ్జిక్యూటివ్ మాదిరిగా తయారయ్యే అఫ్తాబ్ ఎదుటి వారిని బురిడీ కొట్టించడానికి ముందు వారి మానసిక స్థితి, ఆర్థిక పరిస్థితి, అవసరాలను అధ్యయనం చేసిన తర్వాతే టార్గెట్‌ను ఎంపిక చేసుకుంటాడు. మాటలతో గారడీ చేసి తన ‘పని’ పూర్తి చేసుకుంటాడు. ఈ పంథాలో రెచ్చిపోయే అఫ్తాబ్‌ను పట్టుకోవడం సైతం పోలీసులకు సవాలే. పాతబస్తీలోని రెయిన్‌బజార్ ప్రాంతంలో ఇతడి నివాసం ఉన్నప్పటికీ ఎప్పుడు ఎక్కడ ఉంటాడో? ఎవరిని మోసం చేస్తాడో? తెలియని పరిస్థితి. కొన్ని రోజుల పాటు అతడి ఇంటి వద్ద కాపుకాస్తే తప్ప పట్టుకోలేరు. రమ్మంటే రక్తం వస్తుంది... ఇంత కష్టపడిన పోలీసులు అఫ్తాబ్‌ను పట్టుకున్నప్పటికీ అతడిని పూర్తిస్థాయిలో విచారించడం, కాజేసిన డబ్బు/సొత్తు రికవరీ చేయడం అంత తేలికకాదు. శరీర అవయవాలతో పాటు రక్తం కూడా అతడి ‘చెప్పు చేతల్లోనే’ ఉండటం దీనికి ప్రధాన కారణం. పోలీసులు ఇంటరాగేషన్ ప్రారంభించిన వెంటనే తాను చేసిన నేరాల చిట్టా విప్పుతాడు. రికవరీ కోసం సిద్ధమవుతున్నారనే సరికి అఫ్తాబ్‌కు ‘అనారోగ్యం’ వచ్చేస్తుంది. తొలుత కళ్లు తేలేయడంతో పాటు ఏదో ఒక చేతికి పక్షవాతం వచ్చినట్లు వంచేస్తాడు. ఆపై నోరు, చెవి నుంచి రక్తం కారేలా చేస్తాడు. దీనిని చూసిన పోలీసులు ఏదో జరుగుతోందనే భయంతో సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెళ్తారు. అతడికి ఏం జరిగిందనేది గుర్తించడానికి వైద్యులు అనేక పరీక్షలు చేయాల్సి ఉంటుందంటారు. అంత ఖర్చు పెట్టడం సాధ్యం కాని నేపథ్యంలో పోలీసులు ప్రాథమిక చికిత్స చేయించిన అనంతరం అతడు కోలుకున్నాక జైలుకు తరలించేస్తారు. గత ఏడాది ఓ ప్రత్యేక విభాగానికి చిక్కినప్పుడు అఫ్తాబ్ ఇదే పంథా అనుసరించి రికవరీలు ఇవ్వకుండా తప్పించుకున్నాడు. తాజాగా సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కినప్పుడూ ఇదే ‘మంత్రం’ ప్రయోగించాడు. దీంతో అధికారులు ఇతగాడిని పాతబస్తీలో ఉన్న ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అసలు విషయం గుర్తించి చెప్పడంతో తమదైన శైలిలో విచారించిన టాస్క్‌ఫోర్స్ మొత్తం 18 తులాల బంగారం రికవరీ చేయగలిగింది. లాయర్ ఖర్చులు, ఎన్బీడబ్ల్యూలు నో... సాధారణంగా ఏదైనా కేసులో అరెస్టయిన నిందితులు ప్రాథమికంగా ఓ లాయర్‌ను ఏర్పాటు చేసుకుంటారు. ఆయన ద్వారా బెయిల్ తీసుకుని కోర్టు వాయిదాలకు హాజరవుతారు. ఇలా హాజరుకాకుంటే ఆ నిందితుడిపై న్యాయస్థానం నాన్–బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ) జారీ చేస్తుంది. ఒక్కోసారి ఒక్కో ప్రాంతంలో నేరాలు చేసి అక్కడి పోలీసులకు చిక్కే అఫ్తాబ్ కోర్టు వాయిదాలకు హాజరు కావడం, లాయర్‌ను ఫీజులు చెల్లించడం ఇబ్బందికరంగా భావిస్తాడు. ఈ నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెడితే ప్లీడెడ్ గిల్టీ కోసం ప్రయత్నిస్తాడు. అంటే.. ఆయా కేసుల్లో దర్యాప్తు పూర్తయి, చార్జ్షీట్లు దాఖలయ్యే వరకు జైల్లోనే ఉంటాడు. ఆపై న్యాయమూర్తి ఎదుట తాను చేసిన నేరాన్ని అంగీకరించేస్తాడు. దీనినే సాంకేతికంగా ప్లీడెడ్ గిల్టీ అంటారు. దీంతో కోర్టు అతడికి శిక్ష విధించేస్తుంది. అది పూర్తి చేసుకున్న తర్వాతే జైలు నుంచి బయటకు వస్తుంటాడు. ఇది సాధ్యం కాని సందర్భాల్లో మాత్రమే బెయిల్ తీసుకుంటాడని పోలీసులు పేర్కొన్నారు. అనేక కేసుల్లో సాక్షులు, ఫిర్యాదుదారులకు సైతం తన ‘అనారోగ్యం’ చూపించి రా>జీ కోసం ప్రయత్నాలు చేస్తుంటాడని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అఫ్తాబ్ 2007 నుంచి నగరంలో నేరాలు చేస్తున్నప్పటికీ ఒక్క కేసులోనూ ఎన్బీడబ్ల్యూ జారీ కాలేదని వివరిస్తున్నారు. ఇతగాడి నేర చరిత్రను పరిగణలోకి తీసుకున్న నిజామాబాద్ పోలీసుల పీడీ యాక్ట్ ప్రయోగించడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
మోదీ కోసం వికారుద్దీన్ అహ్మద్...
సాక్షి, సిటీబ్యూరో: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ సరిహద్దుల్లో ఉన్న రమోల్ ప్రాంతం... అఫ్జల్‌గంజ్ ఠాణా పరిధిలోని ప్రిన్స్ పేపర్ ట్రేడర్స్‌లో రూ.11 లక్షలు చోరీ చేసిన ‘మాజీ ఇంటి దొంగ’ జగదీష్ గిరి అక్కడే చిక్కాడు. హైదరాబాద్‌కు సంబంధించి ఆ ప్రాంతంలో పోలీసు ఆపరేషన్ జరగడం ఇది రెండోసారి. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం ఉగ్రవాది వికార్ అహ్మద్ కేసు దర్యాప్తులో అక్కడే ఓ సెర్చ్ ఆపరేషన్ సాగింది. ఇప్పుడు జగదీష్ కోసం రెండోది జరిగింది. జగదీష్ అరెస్టు ఆపరేషన్‌ను నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ గురువారం మీడియాకు వెల్లడించిన విషయం విదితమే. రాజస్థాన్‌లోని జాలోర్ జిల్లాకు చెందిన జగదీష్ గిరి తన స్నేహితుడైన ప్రవీణ్ సింగ్‌తో కలిసి ప్రిన్స్ పేపర్ ట్రేడర్స్‌లో రూ.11 లక్షలు చోరీ చేశాడు. ఈ పని పూర్తయిన తర్వాత ఇద్దరూ ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తమ స్వస్థలానికి ప్రయనమయ్యారు. వారు అక్కడికి చేరుకునే లోపే కేసు దర్యాప్తులో భాగంగా జగదీష్ ద్వ యం కదకలను గుర్తించిన అఫ్జల్‌గంజ్ పోలీసులు రమోల్ అధికారులను అప్రమత్తం చే యగా... అక్కడి టోల్ ప్లాజా వద్ద కాపుకాసిన రమోల్ పోలీసులు జగదీష్, ప్రవీణ్‌లను పట్టుకుని, నగ దు స్వాధీనం చేసుకున్నారు. నగరం నుం చి వెళ్లిన పోలీసులు వీరిద్దరినీ అక్కడి కోర్టులో హా జరుపరిచి పీటీ వారెంట్‌పై సిటీకి తీసుకువచ్చారు. మోదీ కోసం వికారుద్దీన్ అహ్మద్... తెహరీక్ గల్బా ఏ ఇస్లాం (టీజీఐ) పేరుతో ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేసిన నగరవాసి వికార్ అహ్మద్ అలియాస్ వికారుద్దీన్ 2009–10ల్లో పోలీసుల పైనే తుపాకీ ఎక్కుపెట్టాడు. ఇతను అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీని టార్గెట్ చేశాడు. గుజరాత్ అల్లర్లకు ప్రతీకారంగా, ఓ వర్గానికి అన్యాయం జరుగుతోందంటూ మోదీనే హత్య చేయాలని కుట్రపన్నాడు. ఆ ఆపరేషన్ కోసం అహ్మదాబాద్ శివార్లలోని రమోల్ ప్రాంతంలో డెన్ ఏర్పాటు చేసుకున్నాడు. తన అనుచరుడు డాక్టర్ హనీఫ్ ద్వారా పరిచయమైన ఆ ప్రాంత లోకల్ లీడర్ జుబేర్ ద్వారా గవర్నమెంట్ స్థలాన్ని కొని అందులో ఇంటిని నిర్మించాడు. మీడియా ప్రతినిధుల్లా మోదీని సమీపించి తుపాకులతో కాల్చి చంపాలని కుట్రపన్నాడు. దీని కోసం ఇమ్రాన్‌ఖాన్ పేరుతో జీ టీవీ, స్టార్ న్యూస్ రిపోర్టర్‌గా పేర్కొంటూ నాలుగు బోగస్ గుర్తింపుకార్డులు తయారు చేసుకున్నాడు. రమోల్ పోలీసుస్టేషన్ ప్రారంభోత్సవానికి మోదీ వచ్చినప్పుడు, మరో రెండుసార్లు ఆయనను హత్య చేయడానికి ప్రయత్నించాడు. అయితే ఎన్ఎస్జీ సెక్యూరిటీ నేపథ్యంలో తన వద్ద ఉన్న షార్ట్ వెపన్స్‌తో ఆపరేషన్ చేయడం కష్టమని వెనక్కుతగ్గాడు. 2010లో వికార్ను అరెస్టు చేసిన నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసు లు రమోల్ వెళ్లి అక్కడి వికార్ ఇంట్లో సోదాలు చేయగా, ఉత్తరప్రదేశ్‌లో కొనుగోలు చేసిన మారణాయుధాల్లో మూడింటిని, ఓ ఎయిర్ పిస్టల్, తూటాలు స్వాధీనం చేసుకున్నారు. -
ఆఫ్రిది ఔదార్యం!
మన్సూర్ అహ్మద్... పాకిస్తాన్ హాకీ సూపర్‌స్టార్స్‌లో ఒకడు. 14 ఏళ్ల కెరీర్లో గోల్‌కీపర్‌గా 338 అంతర్జాతీయ మ్యాచ్‌లలో అతను పాక్‌కు ప్రాతినిధ్యం వహించాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన 1994 ప్రపంచ కప్ ఫైనల్లో చివరి పెనాల్టీని అద్భుతంగా ఆపి జట్టును చాంపియన్‌గా నిలపడంతో అతను జాతీయ హీరోగా మారిపోయాడు. ఆసియా క్రీడలు, చాంపియన్స్ ట్రోఫీల్లో పతకాలు, 1992 బార్సిలోనా ఒలింపిక్స్ కాంస్యం కూడా అతని ఖాతాలో ఉన్నాయి. అయితే ఇంత ఉజ్వలమైన కెరీర్ తర్వాత కూడా ఆర్థికపరంగా మన్సూర్ పరిస్థితి గొప్పగా లేదు. చాలా మంది క్రికెటేతర ఆటగాళ్లలాగే అతనూ ఓ మోస్తరు సంపాదనతోనే గడిపేశాడు. అయితే కొన్నాళ్ల నుంచి హృదయ సంబంధిత వ్యాధితో బాధ పడుతూ మన్సూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అరుదైన ఈ వ్యాధి కోసం ఆస్పత్రి వర్గాలు రూ.15 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేశాయి! సొంత డబ్బు ఇప్పటికే దాదాపుగా ఖర్చు పెట్టేయగా, పాక్ హాకీ సమాఖ్య కొంత సహకరించింది. అయితే ఇప్పుడు పరిస్థితి మరింత ఇబ్బందికరంగా తయారైంది. ఈ సమయంలో పాకిస్తాన్ క్రికెట్ స్టార్ షాహిద్ ఆఫ్రిది నేనున్నానంటూ ముందుకొచ్చాడు. తన స్వచ్ఛంద సంస్థ ద్వారా అతను మన్సూర్‌ను ఆదుకునేందుకు సిద్ధమయ్యాడు. ‘మన్సూర్లాంటి దిగ్గజాన్ని ఇలాంటి స్థితిలో చూస్తూ ఊరుకోలేం. ఆయన మంచి చికిత్స తీసుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యే వరకు షాహిద్ ఆఫ్రిది ఫౌండేషన్ అన్ని ఖర్చులూ భరిస్తుంది’ అని ఆఫ్రిది ప్రకటించాడు. సహజంగానే పాకిస్తాన్లో క్రీడాకారుల ఆదాయం అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో ఆర్జనపరంగా పాక్‌లో నంబర్‌వన్ స్పోర్ట్స్‌మన్ అయిన ఆఫ్రిది మరో ఆటగాడికి సహకరించేందుకు ముందుకు రావడంపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. -
బడ్జెట్ కోసమే అలా చేశారు!
► ఎంపీ మృతిపై పార్లమెంటరీ కమిటీ విచారణకు విపక్షాల డిమాండ్ ► ముందే అహ్మద్ చనిపోయినట్లు సమాచారం ఉందన్న ఆజాద్ ► లోక్‌సభలో ‘పాతనోట్లుంటే శిక్ష–జరిమానా’ బిల్లు న్యూఢిల్లీ: లోక్‌సభ సమావేశాలు శుక్రవారం గందరగోళంగా మారాయి. గుండెపోటుతో మాజీ మంత్రి, ఐఎంయూఎల్ చీఫ్, ఎంపీ ఈ అహ్మద్ మృతిచెందిన విషయంలో ప్రభుత్వం తీరు సరిగా లేదని, బడ్జెట్ కొనసాగించేందుకే వైద్యులతో తప్పుడు ప్రకటనలు చెప్పించారంటూ విపక్షాలు మండిపడ్డాయి. అటు రోజ్‌వాలీ చిట్‌ఫండ్ స్కాంలో తమ ఎంపీలను అరెస్టు చేయటంతోపాటు సీబీఐని దుర్వినియోగం చేస్తున్నారని తృణమూల్ తీవ్రంగా విరుచుకుపడింది. దీంతో విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య సభ వాయిదా పడింది. శుక్రవారం ఉదయం సభ ప్రారంభం కాగానే.. తృణమూల్ సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చారు. కేంద్రం తమ ఎంపీలపై సీబీఐ ద్వారా ఒత్తిడి పెంచుతోందని నినాదాలు చేశారు. ‘సీబీఐ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలా మారింది. రాజకీయ అవసరాల కోసం కేంద్రం సీబీఐని వినియోగించుకుంటోంది’ అని తృణమూల్ ఎంపీలు విమర్శించారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైన వెంటనే ఎంపీ, ఐఎంయూఎల్ అధ్యక్షుడు అహ్మద్‌కు సరైన చికిత్స అందలేదని.. ఆయన మృతిపై కూడా ప్రభుత్వ స్పందన సరిగా లేదని కేరళ ఎంపీలు పార్టీలకు అతీతంగా డిమాండ్ చేశారు. వెల్‌లోకి వచ్చి నినాదాలు చేశారు. ఈ గొడవ మధ్యే.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు స్పీకర్ ఆదేశించారు. కేంద్ర మంత్రి మహేశ్ శర్మ చర్చను ప్రారంభిస్తుండగానే మళ్లీ సభలో గందరగోళం నెలకొంది. రెండుసార్లు వాయిదా పడినా పరిస్థితిలో మార్పు లేకపోవటంతో.. స్పీకర్ సుమిత్ర మహాజన్ లోక్‌సభను సోమవారానికి వాయిదా వేశారు. లోక్‌సభ ముందు ‘పాతనోట్లుంటే శిక్ష’ బిల్లు నవంబర్8 నిర్ణయంతో రద్దుచేసిన పాతనోట్లను దాచుకున్నా, బదిలీ చేసినా, తీసుకున్నా క్రిమినల్ చర్యలతోపాటు రూ.10వేల జరిమానా విధించే బిల్లును ప్రభుత్వం శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కాగా ఈ బిల్లు అనైతికం, దేశ వ్యతిరేకమని తృణమూల్ కాంగ్రెస్ నేత సుగత రాయ్ తీవ్రంగా విమర్శించారు. దీనిపై జైట్లీ కూడా ఘాటుగానే స్పందించారు. ఏ ప్రాతిపదికన తృణమూల్ దీన్ని వ్యతిరేకిస్తుందో చెప్పాలన్నారు. అయితే.. ఈ బిల్లు లోక్‌సభ నిబంధనలకు విరుద్ధమని జైట్లీ లోక్‌సభ సభ్యుడు కానందున ఆయనకు నిబంధనలేమీ తెలియవని సుగత రాయ్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై అధికార పక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. 70వేల మంది చిన్నారులకు మధుమేహం 2015లో భారతదేశంలో 70వేలకు పైగా చిన్నారులు మధుమేహం బారిన పడ్డారని ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. అటు, ఉగ్రవాదానికి సహకరించే దేశాలపై కఠినంగా వ్యవహరించాలని ఆ దేశాలతో వాణిజ్య, ఆర్థిక సంబంధాలు పూర్తిగా తెంచుకోవాలని రాజ్యసభ ఎంపీ ఒకరు ఓ ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. దీనికి కాంగ్రెస్ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ మద్దతు తెలిపారు. ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించాలంటూనే.. ‘56 అంగుళాల ఛాతీ ఎక్కడికెళ్లింది’ అని విమర్శించారు. ప్రభుత్వానికి ముందే తెలుసు! జనవరి 31న రాష్ట్రపతి ప్రసంగం జరుగుతుండగా సెంట్రల్ హాల్లోనే ఎంపీ అహ్మద్ కుప్పకూలిపోయారు. ఫిబ్రవరి 1న ఆయన కన్నుమూశారని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. ఫిబ్రవరి 1న బడ్జెట్ సమావేశాలున్నందున.. సమావేశాలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఆయన ముందురోజే చనిపోయినా ఇంకా బతికే ఉన్నాడనే సందేశాన్ని ఆసుపత్రి వర్గాలు విడుదల చేశాయని ఖర్గే ఆరోపించారు. అహ్మద్ కూతురు, అల్లుడికి ఆసుపత్రి లోపలకు అనుమతించలేదన్నారు. ఆసుపత్రికి తీసుకెళ్లేటప్పటికే అతను మృతిచెందినట్లు కొందరు డాక్టర్లు తనతో చెప్పారని ఆజాద్ అన్నారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ స్వాధీనం
దుబాయ్ వెళుతున్న అహ్మద్ అనే వ్యక్తి నుంచి మంగళవారం ఉదయం భారీగా విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు తనిఖీలు నిర్వహించగా అహ్మద్ వద్ద భారీగా విదేశీ కరెన్సీ ఉన్నట్లు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. నిందితుని అదుపులోకి తీసుకుని విచారణచేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
యువకుడి దారుణహత్య
నగరంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని నింబోలిఅడ్డలో పెయింటర్‌గా పనిచేస్తున్న అహ్మద్(28) అనే యువకుడిని హత్య చేశారు. గుర్తుతెలియని దుండగులు కత్తులతో అతని పై దాడి చేసి హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అసిస్టెంట్ డెరైక్టర్‌తో ప్రేమాయణం!
అతనో అసిస్టెంట్ డెరైక్టర్. పక్కా స్త్రీ ద్వేషి. మొదట్నుంచీ ఎందుకనో అమ్మాయిలకు చాలా దూరంగా ఉంటుంటాడు. అలాంటి వాడికి ఓ కథానాయికతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. అతనిలో తన ప్రేమతో మార్పు తీసుకొస్తుందా కథానాయిక. ఈ నేపథ్యంలో తమిళంలో రూపొందిన చిత్రం ‘ఎండ్రెండ్రుం పున్నగై’. హీరోయిన్గా త్రిష, అసిస్టెంట్ డెరైక్టర్‌గా జీవా నటించారు. అహ్మద్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తమిళంలో ఘనవిజయం సాధించింది. దీన్ని తెలుగులో ‘చిరునవ్వుల చిరుజల్లు’ పేరుతో అనువదిస్తున్నారు వి.ఎస్. రామిరెడ్డి జాని. ఈ నెలలో పాటలను, వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: హేరిస్ జైరాజ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బ్రహ్మస్వామి