సాక్షి, చెన్నై : క్రికెట్ క్రీడ అంటే ఇష్టం, అందుకే 83 చిత్రంలో నటించాను అని యువ నటుడు జీవా పేర్కొ న్నారు. 1983లో ప్రపంచ విజేతగా భారత క్రికెట్ జట్టు అ ప్పటి కెప్టెన్ కపిల్ దేవ్ సా రథ్యంలో నిలిచిన ఇతివృత్తంతో తెరకెక్కుతు న్న హిందీ చిత్రం 83. కబీర్ ఖాన్ తెరకెక్కిస్తున్న ఈ చి త్రం హిందీతో పాటు, తమిళం, తెలుగు వంటి ఇతర భాషల్లోనూ రూపొందుతోంది. కాగా కపిల్ దేవ్‌గా బాలీవుడ్ స్టార్ హీరో రణ వీర్‌సింగ్ నటి స్తుండగా, కృష్టమాచార్య శ్రీకాంత్‌గా నటుడు జీవా నటిస్తున్నారు. ఇందులో నటి దీపికా పడుకోణె నాయకిగా నటిస్తోంది. ఈ చిత్రం సమ్మర్ స్పె షల్‌గా ఏప్రి ల్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా జీవా ఈ చిత్రంలో పాటు చీరు అనే మరో తమిళ చిత్రంలోనూ నటించారు. ఈ చిత్రం 7వ తేదీన తెరపైకి రానుంది. నటుడు జీవా తో ఇంటర్వ్యూ..
ప్ర:తొలిసారిగా 83 చిత్రంలో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆ అనుభవం గురించి?
జ: నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. అందుకే ఆ చిత్రంలో నటించడానికి అంగీకరించాను. అయితే అందులో కృష్టమాచార్య శ్రీకాంత్ పాత్రలో నటించడానికి చాలా శిక్షణ తీసుకున్నాను. అనంతరం ధర్మశాలలో 6 నెలలు క్రికెట్ క్రీడకు ప్రాక్టీస్ చేశాను. ఈ చిత్రం కోసం 17 కిలోల బరువు తగ్గాను. ఆ తరువాత యుకేలో షూటింగ్ చేశాం. అక్కడ రణ్‌వీర్‌సింగ్, దీపికాపదుకునే చిత్ర యూనిట్‌తో కలిసి పనిచేయడం సరి కొత్త అనుభవం. చిత్రం చాలా రియలిస్టిక్‌గా ఆసక్తిగా ఉంటుంది. షూటింగ్ సమయంలో సచిన్, గవాస్కర్, కపిల్‌దేవ్, శ్రీకాంత్ వంటి స్టార్ క్రీడాకారులతో కలిసే అదృష్టం కలిగింది.
ప్ర: ఇకపై హిందీలో నటిస్తారా?
జ: హిందీలో నటించాలనేవుందీ? మనం ఇక్కడ చేసిన మంచి కథలను అక్కడ రీమేక్ చేసేలా ఉంటే చాలు. హీరోగా కాకుండా, 83 చిత్రంలో మాదిరి పాత్రలైతే నటించడానికి సిద్ధమే.
ప్ర: త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్న చీరు చిత్రం గురించి?
జ: చీరు మంచి కటుంబకథా చిత్రంగా ఉంటుంది.
ప్ర: మీకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. అక్కడ చిత్రాలు చేయాలన్న ఆసక్తి లేదా?
ప్ర: ఉంది. ప్రస్తుతం నటిస్తున్న చీరు చిత్రాన్ని తెలుగులోనూ అనువాదం చేసి విడుదల చేస్తున్నాం. కాగా నేను హీరోగా తమిళం, తెలుగు భాషల్లో ఒక చిత్రం చేయడానికి నాన్న (ఆర్‌బీ.చౌదరి) సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో ఒక మంచి సంప్రదాయం ఉంది. అక్కడ ఒక చిత్రం బాగుంటే దాని గురించి ఇతర నటులను అడిగినా బాగుంది అని చెబుతారు. ఇక్కడ అలా కాదు.
ప్ర: మీరు నటించిన జిప్పీ విడుదలలో జాప్యం గురించి?
జ: జిప్సీ చిత్రం చాలా బాగా వచ్చింది. సెన్సార్ సమస్యలు, ఆర్థిక సమస్యలు కారణంగా విడుదలలో జాప్యం జరుగుతోంది.అయితే సెన్సార్ సమస్యలను అధిగమించింది.త్వరలోనే విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment