
నేనింతవరకు పూర్తిగా ప్రదర్శించలేదు
నేనింత వరకు పూర్తి స్థాయి నటనను ప్రదర్శించనేలేదు అన్నారు నటి శ్రీయ. పుష్కరం దాటిన నటీమణుల్లో ఈ బ్యూటీ ఒకరు.
నేనింత వరకు పూర్తి స్థాయి నటనను ప్రదర్శించనేలేదు అన్నారు నటి శ్రీయ. పుష్కరం దాటిన నటీమణుల్లో ఈ బ్యూటీ ఒకరు. శ్రీయ తమిళంలో ఎనక్కు 20 ఉనక్కు 18 చిత్రం ద్వారా రంగప్రవేశం చేశారు. ఆ చిత్రం 2003లో విడుదలైంది. అయితో మళై చిత్రం ద్వారా గుర్తింపు పొందిన ఈ ఉత్తరాది భామ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు జంటగా శివాజీ చిత్రంలో నటించిన తరువాత ప్రముఖ హీరోయిన్ స్థాయికి ఎదిగారు. తరువాత విజయ్, విక్రమ్, విశాల్,ధనుష్, జీవా తదితర స్టార్ హీరోలతో నటించారు. అయితే శ్రీయ తమిళంలో నటించిన చివరి చిత్రం రౌద్రం.
ఈ చిత్రం 2011లో తెరపైకి వచ్చింది.ఆ తరువాత రాజపాటై చిత్రంలో సింగిల్ సాంగ్‌లో నటించినా హీరోయిన్‌గా నటించలేదు. తెలుగులో మాత్రం ఇప్పటికీ కథాయికగా నటిస్తూనే ఉన్నారు. మలయాళం, కన్నడం, హింది భాషల్లోనూ కొన్ని చిత్రాలు చేశారు. అయినా ఇప్పటికీ తనలోని పూర్తి స్థాయి నటిని ఆవిష్కరించే పాత్ర లభించలేదు అంటున్నారామె. శ్రీయ మాట్లాడుతూ తాను తమిళం, తెలుగు,మలయాళం, కన్నడం, హిందీ అంటూ పలు భాషల్లో చాలా చిత్రాల్లో నటించానన్నారు. అందులో పలు మంచి పాత్రల్లో నటించే అవకాశం కలిగిందన్నారు. అయినప్పటికీ తనలోని పూర్తి స్థాయి నటిని ఆవిష్కరించే పాత్ర లభించలేదని అన్నారు. ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంలో శ్రీదేవి నటించిన లాంటి పాత్రను చెయ్యాలనుందని అలాగే బాహుబలి చిత్రంలో అనుష్క నటించినట్లు నటించాలని కోరుకుంటున్నట్లు అన్నారు