
బాల నటిగా సినీ రంగ ప్రవేశం చేసిన మలయాళ బ్యూటీ మంజిమామోహన్. ఆ తరువాత కథానాయకిగా మలయాళం, తెలుగు, తమిళం భాషల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. తమిళంలో శింబు సరసన నటించిన అచ్చం యంబదు మడమయడా చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ తరువాత దేవరాట్టం తదితర చిత్రాల్లో నటించారు.
దేవరాట్టం చిత్రంలో నటించే సమయంలో ఆ చిత్ర హీరో గౌతమ్ కార్తీక్‌తో ప్రేమలో పడింది. గత ఏడాది గౌతమ్ కార్తీక్, మంజిమామోహన్‌ల వివాహం పెద్దల అనుమతితో జరిగింది. కాగా ప్రస్తుతం మంజిమామోహన్ అక్టోబర్ 31 లేడీస్ అనే ద్విభాషా చిత్రంలో నటిస్తున్నారు. కాగా ఈమె తరచూ సామాజక మాధ్యమాల ద్వారా అభిమానులతో ముచ్చటిస్తుంటారు. మంజిమామోహన్‌కి ఇన్‌స్ట్రాగామ్‌లో 19 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.
కాగా మంజిమామోహన్ తన ఇన్‌స్ట్రాగామ్ ద్వారా అభిమానులతో తన భావాలను పంచుకున్నారు. ఆ సమయంలో ఓ అభిమాని మీపై వస్తున్న ట్రోలింగ్ లపై ఎలా స్పందిస్తారు? అన్న ప్రశ్నకు బదులిస్తూ అలాంటి వాటిని తను సీరియస్‌గా తీసుకోనన్నారు. కొన్ని ట్రోలింగ్స్ నిజంగానే హస్యాస్పదంగా ఉంటాయ ని, అలాంటి వాటిని చూసి నవ్వుకుంటానని, తరువాత తన పని తాను చేసుకుపోతానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment