మిస్‌ అవుతున్నాను.. కానీ! | I am Missing Shooting A Lot Says Manjima Mohan | Sakshi
Sakshi News home page

మిస్‌ అవుతున్నాను.. కానీ!

Published Tue, Jun 30 2020 12:35 AM | Last Updated on Tue, Jun 30 2020 7:58 AM

I am Missing Shooting A Lot Says Manjima Mohan - Sakshi

‘‘ప్రస్తుత పరిస్థితుల్లో షూటింగ్స్‌కు దూరంగా ఉండటమే మంచిదని భావిస్తున్నాను’’ అంటున్నారు మంజిమా మోహన్‌. ఈ విషయంపై మంజిమా మాట్లాడుతూ – ‘‘షూటింగ్స్‌ను బాగా మిస్‌ అవుతున్నాను. షూటింగ్స్‌లో పాల్గొనాలని ఉన్నా కరోనా పరిస్థితులు కలవరపెడుతున్నాయి. సెట్‌లో యాభై నుంచి అరవైమంది సభ్యుల మధ్య అనుక్షణం అన్ని జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్స్‌ చేయడం అనేది క్లిష్టతరం. షూటింగ్‌ జరగడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది. కరోనా ప్రభావం అదుపులోకి వస్తే ఆగస్టులో షూటింగ్స్‌ మొదలవుతాయనుకుంటున్నాను’’ అన్నారు. లాక్‌డౌన్‌లో ఏం చేస్తున్నారు? అనే ప్రశ్నకు మంజిమా బదులిస్తూ –‘‘లాక్‌డౌన్‌కి ముందు ఓ తమిళ సినిమా షూటింగ్‌లో నా కాలికి గాయమైంది. దాంతో షూటింగ్‌కు దూరమయ్యాను. ఇప్పుడు ఆన్‌ లైన్‌లో మార్కెటింగ్, ఇంటీరియర్‌ డిజైన్‌ క్లాసులను ఫాలో అవుతున్నాను. అలాగే ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు మేం మొదలుపెట్టిన ‘వన్‌ ఇన్‌ ఏ మిలియన్‌’ ప్లాట్‌ఫామ్‌తో బిజీ అయ్యాను’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement