వీఐపీ 2లో ముగ్గురు భామలు | Kajal, amala and Manjima romance with Dhanush | Sakshi
Sakshi News home page

వీఐపీ 2లో ముగ్గురు భామలు

Nov 24 2016 2:35 PM | Updated on Oct 30 2018 5:58 PM

వీఐపీ 2లో ముగ్గురు భామలు - Sakshi

వీఐపీ 2లో ముగ్గురు భామలు

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఫుల్ ఫాంలో ఉన్నాడు. ఈ ఏడాది రెండు సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ స్టార్ హీరో తొడరితో నిరాశపరిచినా., కోడి సినిమాతో సూపర్ హిట్...

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఫుల్ ఫాంలో ఉన్నాడు. ఈ ఏడాది రెండు సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ స్టార్ హీరో తొడరితో నిరాశపరిచినా., కోడి సినిమాతో సూపర్ హిట్ కొట్టి సత్తా చాటాడు. ఇప్పుడు అదే జోరు మరిన్ని సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఇప్పటికే గౌతమ్ మీనన్, వెట్రీమారన్ లాంటి దర్శకులతో సినిమాలు ప్రారంభించిన ధనుష్, తన మరదలు సౌందర్య దర్శకత్వంలోనూ మరో సినిమాను స్టార్ చేస్తున్నాడు.

ధనుష్ కెరీర్ లోనే బిగెస్ట్ హిట్గా నిలిచిన వీఐపీ సినిమాకు సీక్వల్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. వీఐపీ సినిమా తొలి భాగంలో నటించిన అమలా పాల్తో పాటు కాజల్ అగర్వాల్, మంజిమా మోహన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కబాలి చిత్ర నిర్మాత కలైపులి ఎస్ థాను ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement