‘తుగ్లక్ దర్బార్’లోకి తన పేరు రిజిస్టర్ చేయించుకున్నారు మలయాళ బ్యూటీ మంజిమా మోహన్. విజయ్ సేతుపతి హీరోగా ఢిల్లీ ప్రసాద్ దీనదయాళ్ తెరకెక్కించనున్న సినిమా ‘తుగ్లక్ దర్బార్’. ఇందులో అదితీరావ్ హైదరీ ఒక కథానాయికగా నటించనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మంజిమా మోహన్ మరో హీరోయిన్‌గా నటించనున్నట్లు తాజాగా చిత్రబృందం ప్రకటించింది. ఇందులో విజయ్ సేతుపతి రాజకీయ నాయకుడిగా నటించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ సెప్టెంబర్‌లో ఆరంభం కానుంది. ‘‘విజయ్ సేతుపతి వంటి మంచి నటుడితో నటించడానికి నేను ఆసక్తిగాఎదురుచూస్తున్నాను. రొటీన్ హీరోయిన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది. ఈ సినిమాలో నా పాత్రనాకు చాలెంజింగ్‌గా ఉంటుందనిచెప్పగలను’’ అన్నారు మంజిమా మోహన్.
Comments
Please login to add a commentAdd a comment