
ప్రముఖ ప్రజాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు కాళోజీ నారాయణరావు జీవితం ఆధారంగా రూ΄÷ందిన చిత్రం ‘ప్రజాకవి కాళోజీ’. ప్రభాకర్ జైనీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాళోజీ పాత్రలో మూల విరాట్ నటించారు. విజయలక్ష్మి జైనీ నిర్మించిన ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. యస్‌యస్ ఆత్రేయ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘అలుపెరుగని అవిశ్రాంత కలం యోధుడా...’ పాటను నిర్మాత డి. సురేష్ బాబు విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘ఈ పాట చాలా బాగుంది.
ఇలాంటి వీరుల కథతో సినిమా తీసిన విజయలక్ష్మి, ప్రభాకర్‌లకు అభినందనలు’’ అన్నారు. ‘‘ప్రజా ఉద్యమ నాయకుడైన కాళోజీగారి బయోపిక్ తీసినందుకు సెన్సార్ సభ్యులు అభినందించారు. ఇకపైనా ఇలాంటి గొప్ప వ్యక్తుల సినిమాలు తీసేందుకు ప్రేక్షకుల ్ర΄ోత్సాహం కావాలి’’ అన్నారు ప్రభాకర్ జైనీ. ‘‘ఇలాంటి మంచి సినిమాలో పాటలు రాసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు బిక్కి కృష్ణ. ఈ చిత్రానికి కెమెరా: రవి కుమార్ నీర్ల, నేపథ్య సంగీతం: మల్లిక్ యంవీకే.
Comments
Please login to add a commentAdd a comment