
ప్రస్తుతం బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. మరి మీ బయోపిక్ తీస్తే ఎలా ఉంటుంది? మీ పాత్రలో ఎవరు నటిస్తే బావుంటుంది? అని ఓ ఇంటర్వూ్యలో మహేశ్‌బాబుని అడిగితే ఈ విధంగా స్పందించారు. ‘‘నాది చాలా సింపుల్, బోరింగ్ లైఫ్. నా బయోపిక్ వర్కౌట్ అవుతందని నేను అనుకోను’’ అని సమాధానమి చ్చారు. ఒకవేళ రోడ్ ట్రిప్‌కి వెళ్తే మీతో పాటు ఇండస్ట్రీలో ఎవర్ని తీసుకెళ్తారు? అనే ప్రశ్నకు ‘‘చరణ్ (రామ్‌చరణ్), తారక్ (ఎన్టీఆర్).. అలాగే బ్యాలెన్స్ చేయడానికి చిరంజీవిగారిని తీసుకెళ్తాను’’ అన్నారు మహేశ్‌బాబు. ఇక సినిమాల విషయానికి వస్తే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ చేయనున్న సినిమా షూటింగ్ వేసవి తర్వాత ప్రారంభం కానుందట.
Comments
Please login to add a commentAdd a comment