రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కించిన భారీ బడ్జెట్ సినిమా 'గేమ్ ఛేంజర్'. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా.. మేకర్స్ వరుస అప్‌డేట్స్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. పొలిటికల్, యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీని రూపొందించారు.
అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియోను రామ్ చరణ్ పంచుకున్నారు. గేమ్ ఛేంజర్ షూటింగ్ రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు. చిత్రబృందంతో షూటింగ్‌లో పాల్గొన్న క్షణాలను వీడియో రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
కాగా.. ఇటీవలే 'నానా హైరానా' అంటూ సాగే మెలొడీ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. కార్తిక్, శ్రేయా ఘోషల్ ఆలపించిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచిస్తే.. సంగీత దర్శకుడు తమన్ అదిరిపోయే ట్యూన్స్ అందించారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన రెండు మాస్ పాటలు ప్రేక్షకులను మెప్పించగా.. టీజర్‌కు కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది.
ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్.జె.సూర్య, సముద్రఖని, నవీన్‌చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించారు.
#Gamechanger #JaanaHairaanSa @shankarshanmugh @advani_kiara @BoscoMartis @DOP_Tirru @MusicThaman @AalimHakim @ManishMalhotra pic.twitter.com/Ei3mMAgPHF
— Ram Charan (@AlwaysRamCharan) December 10, 2024
Comments
Please login to add a commentAdd a comment