నేనంత పిచ్చోడిని కాను | I will be a fool to make a biopic on myself | Sakshi
Sakshi News home page

నేనంత పిచ్చోడిని కాను

Published Sun, Jul 29 2018 2:45 AM | Last Updated on Sun, Jul 29 2018 2:45 AM

I will be a fool to make a biopic on myself - Sakshi

అక్షయ్‌ కుమార్‌

రియలిస్టిక్‌ సంఘటనలతో రూపొందే చిత్రాల్లో ఎక్కువగా కనిపించే హీరో అక్షయ్‌ కుమార్‌. ‘ఎయిర్‌లిఫ్ట్, టాయిలెట్‌ : ఏక్‌ ప్రేమ కథ’లే అందుకు ఉదాహరణ. అలాగే బయోపిక్స్‌లో కూడా తరుచూ కనిపిస్తారీ కిలాడీ కుమార్‌. మీ లైఫ్‌ స్టోరీ ఆధారంగా బయోపిక్‌ తీసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? అని అక్షయ్‌ని అడిగితే– ‘‘నా లైఫ్‌ స్టోరీ ఆధారంగా బయోపిక్‌ ఎప్పటికీ తీయను.

అలా తీస్తే నేను పిచ్చోడినైపోతాను. దానికి బదులు చరిత్రలో మిగిలిపోయిన సూపర్‌ హీరోల మీదే సినిమాలు తీస్తాను. మనం చెప్పాల్సిన కథలు చాలా ఉన్నాయి. నా జీవితం ఆధారంగా పుస్తకం కూడా రాసే ఉద్దేశం లేదు’’ అని పేర్కొన్నారు. 1948లో ఒలింపిక్స్‌లో భారతదేశం సాధించిన తొలి బంగారు పతకం ఆధారంగా అక్షయ్‌ లీడ్‌ రోల్‌లో రూపొందిన  ‘గోల్డ్‌’ సినిమా వచ్చే నెలలో విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement