భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మనుసులో మాటను బయటపెట్టాడు. తన జీవితంపై బయోపిక్ తీయాలని అనుకుంటున్నట్లు భజ్జీ తెలిపాడు. భారత్ తరుపున ఆడే రోజుల్లో తను ఎలా ఉన్నానో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అతడు అభిప్రాయపడ్డాడు. అందుకే బయోపిక్ తీయాలని అనుకుంటున్నట్లు భజ్జీ వెల్లడించాడు. ఇప్పటికే భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, మహ్మద్ అజారుద్దీన్‌లపై బయోపిక్‌లు అభిమానులను మురిపించాయి. 1983 ప్రపంచ కప్ విజయం ఆధారంగా రూపొందించబడిన '83' సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తోంది.
"నేను నా జీవితంపై ఒక సినిమా లేదా వెబ్ సిరీస్‌ని రూపొందించాలనుకుంటున్నాను. తద్వారా ఈ కథలో నేను ఎలాంటి వ్యక్తిని,భారత తరపున ఎలా రాణించానో అనే విషయాలను కూడా ప్రజలు తెలుసుకుంటారు" అని జీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. కాగా గత ఏడాది డిసెంబర్‌లో హర్భజన్ అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. భారత తరుపున 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20లు భజ్జీ ఆడాడు. అదే విధంగా ఐపీఎల్‌లో 163 మ్యాచ్‌లు అతడు ఆడాడు.
చదవండి: SA Vs IND: "బౌన్స్ పిచ్‌లపై ఆడటానికి సిద్దంగా ఉన్నా"
Comments
Please login to add a commentAdd a comment