ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ.. ఇద్దరూ భారత క్రికెట్ జట్టుకు వరల్డ్‌కప్‌లు అందించిన కెప్టెన్‌లు. అయితే రోహిత్ గొప్ప, ధోని గొప్ప అంటే మాత్రం సమాధనం చెప్పలేం. ఎందుకంటే కెప్టెన్సీలో గానీ, ఆటలో గానీ ఎవరికి వారే మేటి. తాజాగా ధోని, రోహిత్ శర్మ కెప్టెన్సీ శైలుల గురించి భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని, రోహిత్ ఇద్దరూ వేర్వేరు కెప్టెన్సీ స్టైల్స్‌ను కలిగి ఉన్నారని భజ్జీ చెప్పుకొచ్చాడు.
కెప్టెన్సీలో ధోని, రోహిత్‌లకు ఎటువంటి పోలిక లేదు. ఇద్దరూ వేర్వేరు కెప్టెన్సీ శైలిలను కలిగి ఉన్నారు. ధోని కెప్టెన్సీలో నేను భారత జట్టుతో పాటు ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడాడు. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో కేన్ విలియమ్సన్ వరసుగా బౌండరీలు బాది ఒత్తడిలోకి నెట్టాడు.
ఆ సమయంలో షార్ట్ ఫైన్ లెగ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాను. వెంటనే ధోని వద్దకు వెళ్లి ఠాకూర్ తన బౌలింగ్ లెంగ్త్‌ను మార్చుకుంటే బాగుంటుందని సూచించాను. కానీ ధోని మాత్రం పాజీ నేను ఇప్పుడు అతనితో చెబితే, శార్ధూల్ ఎప్పటికీ నేర్చుకోడు. తనంతట తానే నేర్చుకోనివ్వండి అంటూ నాతో అన్నాడు.
ఇది ధోని స్టైల్ కెప్టెన్సీ. ఇక రోహిత్ శర్మ కెప్టెన్సీ మరో రకం. రోహిత్ చాలా డిఫరెంట్. అతను వెళ్లి ప్రతి ప్లేయర్‌తో మాట్లాడతాడు. ఆటగాడి భుజం మీద చేయి వేసి తన నుంచి ఏమి ఆశిస్తున్నాడో చెబుతాడు. మీరు చేయగలరన్న నమ్మకం అతడు కలిగిస్తాడు.
టెస్టు క్రికెట్‌లో కెప్టెన్‌గా వ్యవహరించినప్పటి నుంచి హిట్‌మ్యాన్ మరింత మెరుగయ్యాడు. ఎవరైనా టెస్టుల్లో జట్టును నడిపించినప్పుడు చాలా విషయాలు నేర్చుకుంటారు. టెస్ట్ క్రికెట్‌కు ఖచ్చితమైన వ్యూహాలు, వాటని అమలు చేయడం చాలా అవసరం. దీంతో ఒక ఉత్తమ నాయకుడిగా నిలుస్తారని "తరువర్ కోహ్లీ పోడ్‌కాస్ట్ ఇచ్చిన ఇంటర్వ్యూలో భజ్జీ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment