బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కు కీలక బాధ్యతలు అప్పగించారు. బాలీవుడ్ లో విభిన్న పాత్రలతో అలరించిన ఆయనను ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు (ఎఫ్ టీ ఐ ఐ) చైర్మన్‌గా నియమించారు. పుణెలో ఉన్న ఈ ఇన్సిస్టిట్యూట్ కు ఇన్నాళ్లు బుల్లితెర నటుడు గజేంద్ర చౌహాన్ చైర్మన్ గా ఉన్నారు. ఇప్పుడు ఆయన స్థానంలో అనుపమ్ ఖేర్ కు బాధ్యతలు అప్పగించారు.
అనుపమ్ గతంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలకు చైర్మన్ గా వ్యవహరించారు. దాదాపు 500లకు పైగా సినిమాల్లో నటించిన అనుపమ్ ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. కళారంగానికి ఆయన అందించిన సేవలకు గానూ భారత ప్రభుత్వం పద్మ శ్రీ, పద్మ భూషణ్ అవార్డులతో సత్కరించింది. చైర్మన్ గా గజేంద్ర చౌహాన్ నియామకం రాజకీయ వత్తిడి కారణంగా జరిగిందంటూ ఇన్సిస్టిట్యూట్ విద్యార్ధులు ఆందోళన చేయటంలో మార్చిలో ఆయన పదవి నుంచి తప్పుకన్నారు.
Comments
Please login to add a commentAdd a comment