పుణెలోని ఎఫ్టీఐఐ చైర్మన్గా నియామకమైన గజేంద్ర చౌహాన్ స్వచ్ఛందంగా తప్పుకుంటే బాగుంటుందని ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషి కపూర్ అన్నారు. విద్యార్థులంతా చౌహాన్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆయన తప్పుకుంటేనే బాగుంటుందని చెప్పారు. తాను వ్యక్తిగతంగా చౌహాన్ కు వ్యతిరేకం కాదని, ఆయనను ఎప్పుడూ కలవడం కూడా జరగలేదని తెలిపారు. సినిమా వృత్తి పుస్తకాలను చదవడం ద్వారా నేర్చుకునే విషయం కాదని చెప్పారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ఏది మంచో ఏది చెడో చేయాల్సిన అవసరం చౌహాన్కు ఉందని తెలిపారు. విద్యార్థులకు చౌహాన్కు ఏవో సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చౌహాన్ కాకుంటే ఆ పదవిలో కూర్చోవడానికి విద్యార్థులకు ఇష్టమైన వారు ఎంతోమంది ఉన్నారని తెలియజేశారు.
అసలు వారెవరు చెప్పడానికి..?
తాను ఎఫ్టీఐఐ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని చెప్పడానికి అసలు రిషికపూర్, అనుపమ్ ఖేర్ ఎవరు అని గజేంద్ర చౌహాన్ అన్నారు. పలు వివాదాలు ముసురుకున్న నేపథ్యంలో ఆయన ఎఫ్టీఐఐ పదవి నుంచి తప్పుకోవాలని అనుపమ్ ఖేర్, స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే మంచిదని రిషికపూర్ సూచించడంతో దీనిపై మీ స్పందనేమిటంటూ ఓ మీడియా సంస్థ ప్రశ్నించగా అసలు వారెవరు చెప్పడానికి అంటూ రుసరుసలాడారు.
'ఎందుకిదంతా.. ఆయనే తప్పుకుంటే మంచిది'
Published Fri, Jul 10 2015 4:00 PM | Last Updated on Sun, Sep 3 2017 5:15 AM
Advertisement