సాధారణంగా రచయితలు దర్శకులుగా మారిన తర్వాత తిరిగి వెనక్కి చూసేది చాలా తక్కువ. కానీ ఓ డైరెక్టర్ మాత్రం ఇప్పుడు తిరిగి రైటర్ అయిపోయారు. ఏకంగా ఓ నవల కూడా రాసేశారు. దీన్ని పలువురు సెలబ్రిటీల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో ఆసక్తికకరంగా మారిపోయింది.
(ఇదీ చదవండి: దీనస్థితిలో 'షాపింగ్ మాల్' హీరో.. ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా?)
బాలీవుడ్‌లో 'కాల్', 'లక్', 'ఫిక్సర్' సినిమాలు తీసిన దర్శకుడు సొహమ్ షా.. ప్రస్తుతం సినిమాలే చేయట్లేదు. అయితే ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ 'బ్లడ్ మూన్' అనే నవలతో సరికొత్త ప్రయాణం మొదలుపెట్టారు. కరోనా కాలంలో చూసిన కొన్ని పరిస్థితుల్ని ఆధారంగా చేసుకుని, పారానార్మల్ థ్రిల్లర్ కథతో ఈ నవలని రాసినట్లు చెప్పుకొచ్చారు. తాజాగా ముంబయిలో జరిగిన కార్యక్రమంలో ఈ నవలని ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ఆవిష్కరించారు.
ఇదే ఈవెంట్‌లో అనుపమ్ ఖేర్‌తో పాటు జాకీ ష్రాఫ్ తదితరులు పాల్గొన్నారు. ఇక వీళ్లిద్దరూ కూడా సొహమ్ షాతో తనుకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అలానే ఈ బుక్ లాంచ్ చేయడం తను గౌరవంగా భావిస్తున్నట్లు అనుపమ్ ఖేర్ చెప్పుకొచ్చారు.
(ఇదీ చదవండి: కుమారీ ఆంటీ ఒకప్పుడు ఆ సింగర్ ఇంట్లో పని చేసింది!)
Comments
Please login to add a commentAdd a comment