తాజా చిత్రం ‘ఎక్కీస్ తోపో కీ సలాం’పై అప్పుడే ప్రశంసల జల్లులు కురుస్తుండడంతో బాలీవుడ్ నటుడు అనుపమ్‌ఖేర్ ఆనందానికి అంతేలేకుండాపోయింది. ఈ సినిమా ఎంతో బాగా ఆడాలని అనుపమ్ అభిలషిస్తున్నాడు. ఈ సినిమా విజయవంతమైతే ఇటువంటి సినిమాలు మున్ముందు మరిన్ని వస్తాయన్నాడు. ‘ఈ సినిమా బాగా ఆడితే మున్ముందు ఇటువంటి సినిమాలు తీసేందుకు నిర్మాతలు ముందుకొస్తారు. వారికి మరింత ధైర్యం వస్తుంది’అని అన్నాడు. ఈ సినిమాపై విమర్శకులు సైతం సదభిప్రాయాన్ని వెలిబుచ్చారు. రివ్యూలు ఎంతో బాగుంటున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా హిట్‌గా నిలవాలి. ఈ సినిమాని అంతా థియేటర్లలోనే చూడాలి’అని అన్నాడు. ఈ సినిమాలో అనుపమ్ తండ్రి పాత్ర పోషించాడు. ఇద్దరు కొడుకులు ఉంటారు.
అయితే వివిధ అంశాలపై వారి మధ్య ఏకాభిప్రాయం ఉండదు. ఈ సినిమాకు వర్ధమాన దర్శకుడు రవీంద్ర దర్శకత్వం వహించాడు. రవీంద్ర దర్శకత్వం వహించిన తొలి సినిమా ఇదే. ఈ సినిమాలో అనుపమ్‌తోపాటు నేహా ధూపియా, సుప్రియాకుమారి, మను రిషి, దివ్యేందు శర్మ, అతిథి శర్మ, ఉత్తర బావ్కర్ తదితరులు నటించారు. సామాన్యుడిని పణంగాపెట్టి రాజకీయనాయకులు అవినీతికి పాల్పడడం ఈ సినిమాలో కనిపిస్తుంది. అవినీతి అందరి నరనరాల్లో పాతుకుపోయిందనేది ఈ సినిమా సారాంశం. ఈ సినిమాలో జాతిపిత మహాత్మాగాంధీ బోధనలు కొంతమేర కనిపిస్తాయి. ‘సారాంశ్’ సినిమా మాదిరిగానే ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ పాత్ర అత్యంత విలక్షణమైనది. తన తండ్రి చివరికోరికను కొడుకు తీర్చడం ఈ సినిమాలో కనిపిస్తుంది. నేహా ధూపియా పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో తీర్చిదిద్దారు.
ఎంతో బాగా ఆడాలి
Published Sat, Oct 11 2014 10:47 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM
Advertisement
Advertisement