తిడతావేంటమ్మా.. నువ్వేం మారలేదు! | Anupam Kher Said She Is Called Me Ganju Patel | Sakshi
Sakshi News home page

‘నువ్వు అనుపమ్‌ కాదు గంజు పటేల్‌..!’

Published Thu, Jul 18 2019 5:11 PM | Last Updated on Thu, Jul 18 2019 6:03 PM

Anupam Kher Said She Is Called Me Ganju Patel  - Sakshi

సాక్షి, ముంబై: బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ తన తల్లి దులరీ ఖేర్‌తో చేసిన చాట్‌ వీడియోను ట్విటర్‌లో పంచుకున్నారు. మా అమ్మ దులరీ ఖేర్‌ చాలా కాలం తర్వాత సోషల్‌ మీడియాలోకి వచ్చింది అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ తల్లీకొడుకుల సరదా సంభాషణ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఆ సంభాషణలో.. దులరీ ఖేర్‌ తన ఫోన్‌ ఎందుకు ఎత్తలేదని అనుపమ్‌ ఖేర్‌ను ప్రశ్నిస్తుంది. దానికి అనుపమ్‌ బదులిస్తూ.. ‘నువ్వు కాల్‌ చేసే సమయానికి విమానంలో ఉన్నాను. అందుకే ఎత్తలేదు. అయినప్పటికీ అల్లంత దూరంలో ఉన్నా కూడా నేను నిన్ను పిలుస్తున్నా.. అయినా కూడా తిడతావేంటమ్మా..’ అంటూనే ‘నా దగ్గర ఉన్న పుస్తకం పేరుని ఇంగ్లీష్‌లో చెప్పు చూద్దాం’ అని తల్లిని అడుగుతాడు.

‘ఏమో నాకు తెలీదు’ అని దులరీ సమాధానం చెపుతుంది. ‘పర్వాలేదు చెప్పమ్మా.. ప్రయత్నించు’ అని అనుపమ్‌ తల్లిని విసిగిస్తాడు. ‘అదంతా కాదు గంజు పటేల్‌.. ముందు నాకు కాల్‌ చెయ్’ అని అతన్ని తిడుతుంది దులరీ. ఒక్కసారిగా  అవాక్కయిన అనుపమ్‌  ‘నన్ను గంజు పటేల్‌ అని పిలుస్తావా..’ అంటూ అలక పూనుతాడు. ఈ దెబ్బకు అనుపమ్‌ తిక్క కుదిరింది అనుకుంటూ దులరీ హాయిగా నవ్వుకుంటుంది.

ఈ వీడియోపై ఆర్టికల్‌ 15 నటుడు ఆయుష్మాన్‌ ఖురాన స్పందిస్తూ.. ‘మీ ప్రేమ ఎంత ముద్దుగా ఉందో..’ అంటూ వారి అనురాగాన్ని చూసి అబ్బురపడ్డారు. తల్లీ కొడుకుల బంధం చూడముచ్చటగా ఉందంటూ నెటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు. అనుపమ్‌ ఖేర్‌ తల్లి దులరీ గతంలోనూ సోషల్‌ మీడియాలో ప్రధాని మోదీ గురించి మాట్లాడి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ముందు మళ్లీ ప్రధానిగా మోదీనే గెలుస్తారని ఆమె జోస్యం చెప్పగా ఆమె అభిమానానికి మోదీ కృతజ్ఞతలు తెలిపారని అనుపమ్‌ గతంలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement