Dulari Kher
-
నన్ను చితక్కొట్టి ఇంట్లో నుంచి గెంటేశారు: అనుపమ్
కశ్మీర్ ఫైల్స్ నటుడు అనుపమ ఖేర్ 'మంజిలే ఔర్ బీ హై' షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఇందులో పలువురు సెలబ్రిటీలను ఆయన ఇంటర్వ్యూ చేస్తుంటాడు. తాజాగా ఈ షోకి అనుపమ్ తల్లి దులరి ఖేర్ వచ్చింది. ఈ సందర్భంగా ఆమె తన పిల్లలు తప్పు చేస్తే ఎలా శిక్షించేదో చెప్పుకొచ్చింది. ఓసారి అనుపమ్ స్కూలుకు వెళ్లేటప్పుడు అతడికి కొంత పాకెట్‌మనీ ఇచ్చిందిట దులరి. కానీ అతడి బ్యాగులో తానిచ్చిన చిల్లరతో పాటు మరో మూడు పైసలు, రెండు పైసలు ఎక్స్ట్రా కనిపించాయట. చిన్నపిల్లాడు పోనీలే అని అతడి తండ్రి ఊరుకుంటే ఆమె మాత్రం ఎందుకు వదిలేయాలి, డబ్బు దొంగిలించినందుకు దండించాల్సిందేనని చెప్పిందట. అలా తనను బట్టలు ఊడగొట్టి మరి ఇంట్లో నుంచి బయటకు వెళ్లగొట్టారని గుర్తు చేసుకున్నాడు అనుపమ్. కానీ ఒకరకంగా తన తల్లి మంచి పనే చేసిందని చెప్పుకొచ్చాడు. అనుపమ్‌తో పాటు అతడి తమ్ముడు రాజు ఖేర్‌ను కూడా బాగా కొట్టేదాన్నంది దులరి. ఓ చెట్టు కట్టెతో కొడితే శరీరమంతా దద్దులు వచ్చేవని తెలిపింది. ఓసారి ఆ కట్టెతో బాగా కొట్టడంతో అనుపమ్ అనారోగ్యానికి గురయ్యాడని, ఆస్పత్రికి తీసుకెళ్లగా డాక్టర్ ఆ చెట్టు విషపూరితమైనదని, ఆ కట్టెతో దండించొద్దని, కావాలంటే చేత్తో కొట్టమని సూచించినట్లు పేర్కొంది. ఇకపోతే అనుపమ్ ఖేర్ నటించిన ఊంచాయ్ మూవీ నవంబర్ 11న విడుదల కానుంది. చదవండి: ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్! పెళ్లి కాకుండా తల్లయినా ఓకే: జయా బచ్చన్ -
‘ఛీ నువ్వు ఏం బాగాలేవు.... ఎండు చేపలా ఉన్నావు’
ముంబై: మనకు మనం బాగానే ఉన్నట్లు కనిపిస్తాం. కానీ మన అమ్మలకు మనం ఎప్పుడూ చిన్నపిల్లలే అన్నట్లుగా మనల్ని ఎప్పడూ చూసిన సన్నగా ఉన్నారంటూ తిడుతుంటారు. మనకేమో మనం బాగానే ఉన్నాం అనిపిస్తుంది. కానీ ఇక్కడ బాలీవుడ్ నటుడు అనుపమ ఖేర్ని సన్నగా ఉన్నావు, నువ్వేం బాగోలేదు అంటూ వాళ్లమ్మ దులారీ ఖేర్ తిడుతుంటుంది. (చదవండి: వీటి స్నేహం బంధం చాలా గొప్పది) పైగా నువ్వు ఎండు చేపలా ఉన్నావు అంటూ పోల్చి మరీ తిడుతుంది. ఆఖరికి అనుపమ్ తాను తింటున్న పరాటాను చూపించనప్పడూ కూడా అతని తల్లి ఆగకుండా రకరకాల హావాభావాలు పెట్టి మరీ తిడుతూనే ఉంటుంది. ఈ మేరకు అనుపమ్ మాట్లాడుతూ.."ఒక నెల తర్వాత అమ్మ నన్ను చూడటంతో ఇలా తిడుతుందని చెబుతున్నారు. తిడితే తిట్టింది గారీ నాకు రెండు మంచి షర్ట్లు తీసుకు వచ్చింది. పైగా మా అమ్మకు నేను చేసిన పరాట కూడా ఆమెకు బాగా నచ్చింది. ఆమె ఉన్నప్పుడూ నిస్తేజంగా ఉండటం అస్సలు కుదరదు. ఆమె లాగానే అందరూ సందడిగా ఉండాల్సిందే. " అన్నారు. (చదవండి: బంపరాఫర్.. ఆ షాపులో ఒక డ్రెస్ ఖరీదు రూ.1 మాత్రమే..!) -
తిడతావేంటమ్మా.. నువ్వేం మారలేదు!
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తన తల్లి దులరీ ఖేర్‌తో చేసిన చాట్ వీడియోను ట్విటర్లో పంచుకున్నారు. మా అమ్మ దులరీ ఖేర్ చాలా కాలం తర్వాత సోషల్ మీడియాలోకి వచ్చింది అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ తల్లీకొడుకుల సరదా సంభాషణ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఆ సంభాషణలో.. దులరీ ఖేర్ తన ఫోన్ ఎందుకు ఎత్తలేదని అనుపమ్ ఖేర్‌ను ప్రశ్నిస్తుంది. దానికి అనుపమ్ బదులిస్తూ.. ‘నువ్వు కాల్ చేసే సమయానికి విమానంలో ఉన్నాను. అందుకే ఎత్తలేదు. అయినప్పటికీ అల్లంత దూరంలో ఉన్నా కూడా నేను నిన్ను పిలుస్తున్నా.. అయినా కూడా తిడతావేంటమ్మా..’ అంటూనే ‘నా దగ్గర ఉన్న పుస్తకం పేరుని ఇంగ్లీష్‌లో చెప్పు చూద్దాం’ అని తల్లిని అడుగుతాడు. ‘ఏమో నాకు తెలీదు’ అని దులరీ సమాధానం చెపుతుంది. ‘పర్వాలేదు చెప్పమ్మా.. ప్రయత్నించు’ అని అనుపమ్ తల్లిని విసిగిస్తాడు. ‘అదంతా కాదు గంజు పటేల్.. ముందు నాకు కాల్ చెయ్’ అని అతన్ని తిడుతుంది దులరీ. ఒక్కసారిగా అవాక్కయిన అనుపమ్ ‘నన్ను గంజు పటేల్ అని పిలుస్తావా..’ అంటూ అలక పూనుతాడు. ఈ దెబ్బకు అనుపమ్ తిక్క కుదిరింది అనుకుంటూ దులరీ హాయిగా నవ్వుకుంటుంది. ఈ వీడియోపై ఆర్టికల్ 15 నటుడు ఆయుష్మాన్ ఖురాన స్పందిస్తూ.. ‘మీ ప్రేమ ఎంత ముద్దుగా ఉందో..’ అంటూ వారి అనురాగాన్ని చూసి అబ్బురపడ్డారు. తల్లీ కొడుకుల బంధం చూడముచ్చటగా ఉందంటూ నెటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు. అనుపమ్ ఖేర్ తల్లి దులరీ గతంలోనూ సోషల్ మీడియాలో ప్రధాని మోదీ గురించి మాట్లాడి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ముందు మళ్లీ ప్రధానిగా మోదీనే గెలుస్తారని ఆమె జోస్యం చెప్పగా ఆమె అభిమానానికి మోదీ కృతజ్ఞతలు తెలిపారని అనుపమ్ గతంలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. She is BACK!! She has not Changed!! 😬🙄. Video called Mom in Shimla from NY. She scolded me without provocation. She called me ‘गंजु पटेल’ (Bald Dude). Efforts to make her say the title of my #Autobiography #LessonsLifeTaughtMeUnKnowingly# were a disaster.🤦🏻♂️🤦🏻♂️🤣😂 #DulariRocks pic.twitter.com/7xsktTdZRV — Anupam Kher (@AnupamPKher) July 17, 2019 -
అమ్మకు సీనియర్ నటుడు అరుదైన కానుక
ముంబయి: తల్లిదండ్రులు పిల్లల సంతోషం కోసం, వారికి ఎన్నో సమకూర్చుతారు. అదే విధంగా పిల్లలు ప్రయోజకులయ్యాక తిరిగి తమకే ఏదైనా బహుమతి ఇస్తే వారి ఆనందం ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం కూడా. ఇలాంటి సంతోషకర సంఘటన బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ఇంట్లో జరిగింది. అనుపమ్ హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లాలో పుట్టి పెరిగారు. తన సొంత ప్రాంతం సిమ్లాలో ఓ ఇల్లు కొనాలన్నది కొన్నేళ్ల అనుపమ్ కలను తాజాగా నెరవేర్చుకున్నారు. సిమ్లాలో కొనుకోలు చేసిని ఇంటిని తన తల్లి దులరీ ఖేర్కి బహుమతిగా ఇచ్చారు. ఈ సంతోషాన్ని వెటరన్ నటుడు ట్విట్టర్ ద్వారా ఫాలోయర్లతో షేర్ చేసుకున్నారు. 'సొంత గ్రామంలో సొంత ఇల్లు ఉండాలని భారతీయులు భావిస్తుంటారు. నేను పుట్టి, పెరిగిన సిమ్లాలో ఇప్పుడు మాకంటూ ఓ సొంత ఇల్లు ఉంది. మా నాన్న ఇక్కడి అటవీశాఖలో క్లర్క్‌గా చేశారు. దీంతో ఎక్కువగా డిపార్ట్మెంట్ క్వార్టర్లలో, అద్దె ఇళ్లలో ఉండేవాళ్లం. సొంతింటి కలకు ఇన్నేళ్లు పట్టింది. ఇప్పుడు సిమ్లాకు వచ్చి ఇల్లు కొనుగోలు చేశాను. ఆ ఇంటిని అమ్మకు కానుకగా అందించాను. అమ్మ చాలా సంతోషపడ్డారు' అని ఓ వీడియోను అనుపమ్ ఖేర్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తల్లి సంతోషం కోసం చాలా మంచి పని చేశారని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.