అమ్మకు సీనియర్ నటుడు అరుదైన కానుక | actor Anupam Kher Gifts Mother Her Dream House In homwtown Shimla | Sakshi
Sakshi News home page

అమ్మకు సీనియర్ నటుడు అరుదైన కానుక

Published Sun, Mar 26 2017 5:50 PM | Last Updated on Tue, Sep 5 2017 7:09 AM

అమ్మకు సీనియర్ నటుడు అరుదైన కానుక

అమ్మకు సీనియర్ నటుడు అరుదైన కానుక

ముంబయి: తల్లిదండ్రులు పిల్లల సంతోషం కోసం, వారికి ఎన్నో సమకూర్చుతారు. అదే విధంగా పిల్లలు ప్రయోజకులయ్యాక తిరిగి తమకే ఏదైనా బహుమతి ఇస్తే వారి ఆనందం ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం కూడా. ఇలాంటి సంతోషకర సంఘటన బాలీవుడ్‌ సీనియర్ నటుడు అనుపమ్‌ ఖేర్‌ ఇంట్లో జరిగింది. అనుపమ్ హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లాలో పుట్టి పెరిగారు. తన సొంత ప్రాంతం సిమ్లాలో ఓ ఇల్లు కొనాలన్నది కొన్నేళ్ల అనుపమ్‌ కలను తాజాగా నెరవేర్చుకున్నారు. సిమ్లాలో కొనుకోలు చేసిని ఇంటిని తన తల్లి దులరీ ఖేర్‌కి బహుమతిగా ఇచ్చారు. ఈ సంతోషాన్ని వెటరన్ నటుడు ట్విట్టర్ ద్వారా ఫాలోయర్లతో షేర్ చేసుకున్నారు.

'సొంత గ్రామంలో సొంత ఇల్లు ఉండాలని భారతీయులు భావిస్తుంటారు. నేను పుట్టి, పెరిగిన సిమ్లాలో ఇప్పుడు మాకంటూ ఓ సొంత ఇల్లు ఉంది. మా నాన్న ఇక్కడి అటవీశాఖలో క్లర్క్‌గా చేశారు. దీంతో ఎక్కువగా డిపార్ట్‌మెంట్ క్వార్టర్లలో, అద్దె ఇళ్లలో ఉండేవాళ్లం. సొంతింటి కలకు ఇన్నేళ్లు పట్టింది. ఇప్పుడు సిమ్లాకు వచ్చి ఇల్లు కొనుగోలు చేశాను. ఆ ఇంటిని అమ్మకు కానుకగా అందించాను. అమ్మ చాలా సంతోషపడ్డారు' అని ఓ వీడియోను అనుపమ్ ఖేర్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తల్లి సంతోషం కోసం చాలా మంచి పని చేశారని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement