Anupam Kher Reveals Mom Dulari Kher Used to Beat Him with Bichu Buti - Sakshi
Sakshi News home page

Anupam Kher: పైసలు తీసినందుకు చితక్కొట్టి గెంటేశారు

Published Sat, Oct 29 2022 4:27 PM | Last Updated on Sat, Oct 29 2022 5:58 PM

Anupam Kher Reveals Mom Dulari Kher Used to Beat Him with Bichu Buti - Sakshi

కశ్మీర్‌ ఫైల్స్‌ నటుడు అనుపమ​ ఖేర్‌ 'మంజిలే ఔర్‌ బీ హై' షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఇందులో పలువురు సెలబ్రిటీలను ఆయన ఇంటర్వ్యూ చేస్తుంటాడు. తాజాగా ఈ షోకి అనుపమ్‌ తల్లి దులరి ఖేర్‌ వచ్చింది. ఈ సందర్భంగా ఆమె తన పిల్లలు తప్పు చేస్తే ఎలా శిక్షించేదో చెప్పుకొచ్చింది. 

ఓసారి అనుపమ్‌ స్కూలుకు వెళ్లేటప్పుడు అతడికి కొంత పాకెట్‌మనీ ఇచ్చిందిట దులరి. కానీ అతడి బ్యాగులో తానిచ్చిన చిల్లరతో పాటు మరో మూడు పైసలు, రెండు పైసలు ఎక్స్‌ట్రా కనిపించాయట. చిన్నపిల్లాడు పోనీలే అని అతడి తండ్రి ఊరుకుంటే ఆమె మాత్రం ఎందుకు వదిలేయాలి, డబ్బు దొంగిలించినందుకు దండించాల్సిందేనని చెప్పిందట. అలా తనను బట్టలు ఊడగొట్టి మరి ఇంట్లో నుంచి బయటకు వెళ్లగొట్టారని గుర్తు చేసుకున్నాడు అనుపమ్‌. కానీ ఒకరకంగా తన తల్లి మంచి పనే చేసిందని చెప్పుకొచ్చాడు.

అనుపమ్‌తో పాటు అతడి తమ్ముడు రాజు ఖేర్‌ను కూడా బాగా కొట్టేదాన్నంది దులరి. ఓ చెట్టు కట్టెతో కొడితే శరీరమంతా దద్దులు వచ్చేవని తెలిపింది. ఓసారి ఆ కట్టెతో బాగా కొట్టడంతో అనుపమ్‌ అనారోగ్యానికి గురయ్యాడని, ఆస్పత్రికి తీసుకెళ్లగా డాక్టర్‌ ఆ చెట్టు విషపూరితమైనదని, ఆ కట్టెతో దండించొద్దని, కావాలంటే చేత్తో కొట్టమని సూచించినట్లు పేర్కొంది. ఇకపోతే అనుపమ్‌ ఖేర్‌ నటించిన ఊంచాయ్‌ మూవీ నవంబర్‌ 11న విడుదల కానుంది.

చదవండి: ఊహించని కంటెస్టెంట్‌ ఎలిమినేట్‌!
పెళ్లి కాకుండా తల్లయినా ఓకే: జయా బచ్చన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement