
బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఆఫీస్‌లో దొంగలు పడ్డారు. ఓ సినిమా నకలుతోపాటు విలువైన డాక్యుమెంట్లను ఎత్తుకెళ్లారు. రూ.4 లక్షల నగదు సైతం దొంగిలించారు. ఈ ఘటనపై అనుపమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఓ వీడియో షేర్ చేశాడు. 'నిన్న రాత్రి ముంబైలోని వీర దేశాయ్ రోడ్‌లో ఉన్న నా ఆఫీసులో చోరీ జరిగింది. ఇద్దరు దొంగలు తలుపులు బద్ధలు కొట్టి లోనికి ప్రవేశించి విలువైన పత్రాలను దొంగతనం చేశారు.
సీసీటీవీలో..
వాటిని నాశనం చేయరని ఆశిస్తున్నాను. అలాగే మా కంపెనీ నిర్మించిన ఓ సినిమా నెగెటివ్స్ కూడా మాయం చేశారు. ఆ ఇద్దరు దొంగలు లగేజీతో ఆటోలో వెళ్లినట్లు సీసీటీవీ కెమెరాలో నమోదైంది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వీలైనంత త్వరగా దొంగలను పట్టుకుంటామని హామీ ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేముందు నా ఆఫీసులో పనిచేసేవారు తీసిన వీడియో ఇది' అని చెప్పుకొచ్చాడు.
సినిమా..
కాగా ది కశ్మీర్ ఫైల్స్‌తో సెన్సేషన్‌గా మారిన అనుపమ్ ఖేర్.. ఇటీవల ఐబీ71, ద వ్యాక్సిన్ వార్, కుచ్ ఖట్టా హో జాయే, కాగజ్ 2 వంటి చిత్రాలతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం మెట్రో.. ఇన్ డినో, తన్వి ద గ్రేట్ అనే మూవీస్‌లో నటిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment