
బాలీవుడ్ దిగ్గజ నటుడు అనుపమ్ ఖేర్ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఇంటికి వెళ్లాడు. ఇటీవలే ఒక కార్యక్రమం కోసం హైదరాబాద్ వచ్చిన అనుపమ్ సింధు ఇంటికి వెళ్లి సందడి చేశారు. ఈ సందర్భంగా సింధూ సాధించిన ట్రోఫీలు చూసి షాక్ తిన్నాడు. దీనికి సంబంధించిన వీడియోనూ అనుపమ్ ఖేర్ స్వయంగా షేర్ చేసుకున్నాడు.
"వన్ అండ్ ఓన్లీ ఛాంపియన్. ఈ గోడ చూడండి. నా ఇంట్లో నా దగ్గర ఉన్న అవార్డులు చూసి నా గోడపై చాలా ఎక్కువ ఉన్నాయని అనుకునే వాడిని. కానీ ఇక్కడ చూడండి. అద్భుతం. ఇక్కడ అసలు స్థలమే లేదు" అని అనుపమ్ అన్నాడు. అనంతరం ఆమె తండ్రితోనూ అనుపమ్ మాట్లాడాడు. సింధు గెలుస్తున్న ట్రోఫీలు పెట్టడానికి స్థలం సరిపోవడం లేదని, అందుకే ఇంకో అంతస్తు కట్టాలని అనుకుంటున్నట్లు సింధు తండ్రి చెప్పడం విశేషం. ఆమె ఇంటికి వెళ్లడం చాలా సంతోషంగా ఉందన్న అనుపమ్.. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ తాను ఎలాంటి అనుభూతి చెందాడో వివరించాడు.
"ఇది అద్భుతం. ఈ మధ్యే నేను ఛాంపియన్ పీవీ సింధు ఇంటికి వెళ్లాను. ఆమె తాను సాధించిన ట్రోఫీలను చూపించింది. 8 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచీ అందులో ఉన్నాయి. ఆమె అవార్డులు, ట్రోఫీలు, ఆమె వినయం చూసి బౌల్డయ్యాను. ఆమె మన ఇండియా కూతురు. ఆమె మనను మోటివేట్ చేసే హీరో. జై హో.. జై హింద్" అని పేర్కొన్నాడు. అటు సింధు కూడా అనుపమ్ ఖేర్‌తో దిగిన ఫొటోను షేర్ చేసింది. అతన్ని కలవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పింది.
AMAZING: I had the privilege of visiting CHAMP @Pvsindhu1’s home.She very humbly gave me a tour of her achievements, awards and trophies! Right from the age of 8!😳ये है हमारे भारत की बेटी।ये है हमारे देश की शान।ये है हमारी प्रेरणात्मक HERO! जय हो! जय हिंद! 👏🌈🇮🇳🇮🇳 #YouthIcon pic.twitter.com/gk1ooybScE
— Anupam Kher (@AnupamPKher) September 29, 2022
Comments
Please login to add a commentAdd a comment