ఎన్టీఆర్ ఇప్పుడు ముంబైలో ఉన్న సంగతి తెలిసిందే. దేవర షూటింగ్‌కి గ్యాప్ ఇచ్చి, ‘వార్ 2’సెట్స్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్‌కు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ అంతా ముంబైలోనే జరుగుతుండడంతో.. ఖాలీ సమయంలో తన స్నేహితులను కలుస్తూ ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నాడు.
తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరో అనుపమ్ ఖేర్ కలిశాడు తారక్. ఎన్టీఆర్‌తో కలిసి దిగిన ఫోటోని అనుపమ్ ఎక్స్(ట్విటర్)లో షేర్ చేస్తూ.. ‘నా ఫేవరేట్ పర్సన్. యాక్టర్ ఎన్టీఆర్ ను కలవడం చాలా ఆనందంగా ఉంది. అతని వర్క్ నాకు చాలా ఇష్టం. అతను జీవితంలో మరింత ఎత్తుకు ఎదగాలి’ అంటూ రాసుకొచ్చారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ‘‘వార్ 2’లో అనుపమ్ నటిస్తున్నారా?’, ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రంలో అనుపమ్ కీలక పాత్ర పోషిస్తున్నారా ఏంటి? అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
It was such a pleasure to meet one of my favourite persons and actor @tarak9999 last night. Have loved his work. May he keep rising from strength to strength! Jai Ho! 😍🕉👏 #Actors pic.twitter.com/XSetC87b4Y
— Anupam Kher (@AnupamPKher) May 1, 2024
Comments
Please login to add a commentAdd a comment