
మాజీ ప్రధానమంత్రి మన్‌మోహన్ సింగ్ పై తెరకెక్కుతున్న చిత్రం ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’. అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో విడుదల చేశారు. ప్రధాని పాత్రలో ఖేర్ తెల్లని గడ్డంతో, తలపాగ ధరించి దీర్ఘ ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. సంజయ్ బారు పుస్తకం ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’ ఆధారంగా ఇదే పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విజయ్ రత్నాకర్ గుట్లే దర్శకత్వం వహిస్తున్నారు. లండన్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment