ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై వివాదం ఇంకా ముగిసిపోలేదు. సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై దుమారం మరింత రాజుకుంటోంది. ఇప్పటికే ప్రకాశ్ రాజ్‌కు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కౌంటర్ ఇచ్చారు. ది కశ్మీర్ ఫైల్స్ ఓ నాన్సెన్స్ ఫిల్మ్ అన్న వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేరళలో జరిగిన ఓ ఈవెంట్‌లో ది కాశ్మీర్ ఫైల్స్ ఓ నాన్సెన్స్ ఫిల్మ్ అంటూ ప్రకాశ్ రాజ్ ఘాటుగా వ్యాఖ్యనించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ జ్యూరీనే వారి సినిమాపై ఉమ్మివేసిందని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
అయితే తాజాగా ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై ది కశ్మీర్ ఫైల్స్ నటుడు అనుపమ్ ఖేర్ స్పందించారు. తన జీవితమంతా ఎల్లప్పుడూ నిజమే మాట్లాడాతానని ఆయన చెప్పారు. కొంతమంది అబద్ధాలతో తమ జీవితాన్ని వెల్లదీస్తున్నారని ప్రకాశ్ రాజ్‌ను ఉద్దేశించి మాట్లాడారు.
అనుపమ్ ఖేర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ' కొందరు మనుషులు తమ స్థాయిని తగ్గట్లు మాట్లాడతారు. కొంతమంది మాత్రం తమ జీవితమంతా అబద్ధం చెబుతారు. మరికొందరు నిజాలే మాట్లాడతారు. నా జీవితమంతా నిజం మాట్లాడిన వారిలో నేనూ ఒకడిని. అబద్ధాలు చెబుతూ జీవించాలనుకోవడం అది వారి కోరిక.' అంటూ ప్రకాశ్ రాజ్‌కు గట్టిగా కౌంటరిచ్చారు.
కాగా.. గతేడాది విడుదలైన ది కాశ్మీర్ ఫైల్స్ 1990లలో కశ్మీరీ హిందువుల వలసలను ఈ చిత్రంలో చూపించారు.వివేక్ అగ్నిహౌత్రి దర్శకత్వంలో జీ స్టూడియోస్ నిర్మించారు. ఈ చిత్రంలో అనుపమ్ ప్రధాన పాత్రలో పల్లవి జోషి, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్ తదితరులు నటించారు.
Comments
Please login to add a commentAdd a comment