బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ ప్రత్యేక ఫోటోని షేర్ చేశారు. 1996లో మైఖేల్ జాక్సన్ భారతదేశం వచ్చినప్పుడు తీసిన ఫోటో ఇది. పాప్ మహారాజు మైఖేల్ జాక్సన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన అనుపమ్ ఖేర్.. ఆనాడు జరిగిన ఓ సంఘటనను అభిమానులతో పంచుకున్నారు. మైఖేల్ జాక్సన్‌ను చూడటం కోసం తాను బారికేడ్లను తొలగించి ముందుకు వెళ్లానని.. ఆ సమయంలో జాక్సన్ బాడీగార్డులు తనను తోసేశారని తెలిపారు. (‘మన పెళ్లి నిన్ననే జరిగినట్లు అనిపిస్తోంది’)
అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ.. ‘1996లో మైఖేల్ జాక్సన్ ఇండియా వచ్చారు. హోటల్ ఒబెరాయ్‌లో బస చేశారు. ఆయనను కలవడానికి భారత ప్రభుత్వం కొందరిని మాత్రమే ఎంపిక చేసింది. అదృష్టవశాత్తు వారిలో నేను కూడా ఉన్నాను. ఆ రోజు సాయంత్రం ఒబెరాయ్ హోటల్‌లో జాక్సన్‌ను కలిసే కార్యక్రమం ఏర్పాటు చేశారు. అక్కడ పాప్ మహారాజు కోసం ఓ ప్రత్యేక వేదికని ఏర్పాటు చేశారు. దాని మీద మైఖేల్ జాక్సన్ నిల్చుని ఉన్నాడు. చుట్టూ బాడీగార్డులున్నారు. నాతో పాటు ఎంపిక చేసిన మరికొందరు జాక్సన్‌ను కలవడానికి లైన్‌లో నిల్చుని ఉన్నాం. మరి కొద్ది క్షణాల్లో నేను జాక్సన్‌ని కలుస్తాను. కానీ సంతోషం తట్టుకోలేక బారికేడ్లను తొలగించి ముందుకు వెళ్లాను. ఆయనను హత్తుకునే ప్రయత్నం చేశాను’ అన్నారు. (వైరల్: నువ్వు మామూలు తల్లివి కాదమ్మా!..)
అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ.. ‘కానీ పక్కనే ఉన్న జాక్సన్ బాడీ గార్డులు నన్ను తోసేసే ప్రయత్నం చేశారు. ఇంతలో భరత్ భాయి షా అక్కడకు పరిగెత్తుకు వచ్చి నన్ను జాక్సన్‌కు పరిచయం చేశాడు. ‘ఇతడు అనుపమ్ ఖేర్. భారతీయ ప్రముఖ నటులలో ఒకరు’ అన్నాడు. అప్పుడు వెంటనే జాక్సన్ మర్యాదపూర్వకంగా వంగి.. నాకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఆ సమయంలో తీసిన ఫోటో ఇది’ అని చెప్పుకొచ్చారు అనుపమ్ ఖేర్. (ఆ విషయం మైకేల్ జాక్సన్ ముందే చెప్పారు)
Comments
Please login to add a commentAdd a comment