michel jackson
-
‘మైఖేల్ జాక్సన్ బాడీగార్డులు నన్ను తోసేశారు’
బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ ప్రత్యేక ఫోటోని షేర్ చేశారు. 1996లో మైఖేల్ జాక్సన్ భారతదేశం వచ్చినప్పుడు తీసిన ఫోటో ఇది. పాప్ మహారాజు మైఖేల్ జాక్సన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన అనుపమ్ ఖేర్.. ఆనాడు జరిగిన ఓ సంఘటనను అభిమానులతో పంచుకున్నారు. మైఖేల్ జాక్సన్‌ను చూడటం కోసం తాను బారికేడ్లను తొలగించి ముందుకు వెళ్లానని.. ఆ సమయంలో జాక్సన్ బాడీగార్డులు తనను తోసేశారని తెలిపారు. (‘మన పెళ్లి నిన్ననే జరిగినట్లు అనిపిస్తోంది’) అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ.. ‘1996లో మైఖేల్ జాక్సన్ ఇండియా వచ్చారు. హోటల్ ఒబెరాయ్‌లో బస చేశారు. ఆయనను కలవడానికి భారత ప్రభుత్వం కొందరిని మాత్రమే ఎంపిక చేసింది. అదృష్టవశాత్తు వారిలో నేను కూడా ఉన్నాను. ఆ రోజు సాయంత్రం ఒబెరాయ్ హోటల్లో జాక్సన్‌ను కలిసే కార్యక్రమం ఏర్పాటు చేశారు. అక్కడ పాప్ మహారాజు కోసం ఓ ప్రత్యేక వేదికని ఏర్పాటు చేశారు. దాని మీద మైఖేల్ జాక్సన్ నిల్చుని ఉన్నాడు. చుట్టూ బాడీగార్డులున్నారు. నాతో పాటు ఎంపిక చేసిన మరికొందరు జాక్సన్‌ను కలవడానికి లైన్లో నిల్చుని ఉన్నాం. మరి కొద్ది క్షణాల్లో నేను జాక్సన్‌ని కలుస్తాను. కానీ సంతోషం తట్టుకోలేక బారికేడ్లను తొలగించి ముందుకు వెళ్లాను. ఆయనను హత్తుకునే ప్రయత్నం చేశాను’ అన్నారు. (వైరల్: నువ్వు మామూలు తల్లివి కాదమ్మా!..) అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ.. ‘కానీ పక్కనే ఉన్న జాక్సన్ బాడీ గార్డులు నన్ను తోసేసే ప్రయత్నం చేశారు. ఇంతలో భరత్ భాయి షా అక్కడకు పరిగెత్తుకు వచ్చి నన్ను జాక్సన్‌కు పరిచయం చేశాడు. ‘ఇతడు అనుపమ్ ఖేర్. భారతీయ ప్రముఖ నటులలో ఒకరు’ అన్నాడు. అప్పుడు వెంటనే జాక్సన్ మర్యాదపూర్వకంగా వంగి.. నాకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఆ సమయంలో తీసిన ఫోటో ఇది’ అని చెప్పుకొచ్చారు అనుపమ్ ఖేర్. (ఆ విషయం మైకేల్ జాక్సన్ ముందే చెప్పారు) View this post on Instagram Story of this picture!! When Michael Jackson visited India in 1996 a group of selected people were invited to meet him exclusively at Oberoi hotel gardens. I was also the lucky one. Thanks to Bharat Bhai Shah. There was a small stage set up in the garden with a barricade for the special guests. MJ walked down from his suite and stood on the improvised stage with his bodyguards. There was silence and sense of awe among the selected guests. I was looking at this magician who had enthralled and hypnotised the entire universe with his electrifying performances. He was just few feet away from me. I wanted to capture this moment. So I broke the barricade jumped on the stage and almost hugged MJ. The bodyguards rushed towards me and before they could pick me up bodily Bharat Bhai Shah in panic introduced me to Michael Jackson as the biggest actor in India. He immediately and politely bent down and shook a jubilant me’s hands. And my history was captured in this picture. Sometimes you have to make an effort to create Kucch Bhi Ho Sakta Hai moments. Jai Ho!! 😍😍😎🤓 Pic courtesy my friend @timmins.andre. #MichaelJackson #Overwhelming A post shared by Anupam Kher (@anupampkher) on Jun 29, 2020 at 6:24pm PDT -
మైకేల్ జాక్సన్ తండ్రి కన్నుమూత
పాప్ మేనేజర్, పాప్ రారాజు మైకేల్ జాక్సన్ తండ్రి జోయ్ జాక్సన్ ఇక లేరు. పాంక్రియాటిక్ కేన్సర్‌తో బాధపడుతున్న జోయ్(89) లాస్ వేగాస్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం ఉదయం పరిస్థితి విషమించి ఆయన కన్నుమూసినట్లు తెలుస్తోంది. జోయ్ మనవళ్లు రాండీ జాక్సన్ జూనియర్, టై జాక్సన్‌లు ట్విటర్లో ఈ విషయాన్ని దృవీకరించారు. మైకేల్ జాక్సన్ తనయుడు, జోయ్ మనవడు ప్రిన్స్ మైకేల్ జాక్సన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సందేశం ఉంచాడు. ‘ అంకితభావానికి మారుపేరు ఈయన. కుటుంబం కోసం ఆయన కష్టమైన మార్గాన్ని ఎంచుకుని ముందుకు నడిచాడు’ అంటూ జోయ్ ఫోటోను ఉంచాడు. జోయ్ మృతితో ‘జాక్సన్’ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యులతోపాటు పలువురు సెలబ్రిటీలు సైతం జోయ్ మృతికి సంతాపం చెబుతున్నారు. 1928 జూలై 26న అమెరికాలోని అర్కన్‌సస్‌లోని ఫౌంటెన్‌హిల్స్‌లో జోయ్ జాక్సన్ జన్మించారు. ఆయనకు భార్య కేథరిన్ మరియు 11 మంది సంతానం. వీరిలో పుట్టగానే ఓ బిడ్డ చనిపోగా, మైకేల్ జాక్సన్ 8వ సంతానం. చిన్నతనంలోనే పిల్లలోని మ్యూజిక్ ట్యాలెంట్‌ను గుర్తించిన జోయ్ వారికి బాగా ప్రోత్సహించాడు. వారందరికీ మేనేజర్‌గా వ్యవహరిస్తూ వారిని ప్రపంచానికి పరిచయం చేశారు. తండ్రిగా కంటే ఓ మేనేజర్‌గానే జోయ్ తమ పట్ల కఠినంగా వ్యవహరించేవారని, ఆ క్రమశిక్షణే తమ ఎదుగుదలకు సహకరించిందని మైకేల్ జాక్సన్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పటం చూశాం. పాప్ రారాజుగా వెలుగొందిన మైకేల్ జాక్సన్ (50) 2009, జూన్ 25వ తేదీన గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. జోయ్ చిన్న కూతురు జానెట్ జాక్సన్(52) కూడా పాప్ దిగ్గజమే. జోయ్‌కు పలు అవార్డులు కూడా దక్కాయి. -
రికార్డు బుక్‌లోని 'మూన్‌వాక్' !
మైకేల్ జాక్సన్ రికార్డును బద్దలుకొట్టిన పాలమూరు కుర్రాడు గంటలో 4.2 కి.మీ. దూరం 'మూన్‌వాక్' జడ్చర్ల: ప్రపంచ ప్రఖ్యాత డ్యాన్సర్ మైకేల్ జాక్సన్ మూన్‌వాక్‌తో సృష్టించిన గిన్నిస్ బుక్ రికార్డును తెలంగాణ యువకుడు బ్రేక్ చేశాడు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్‌లో నిర్వహించిన మూన్‌వాక్ ఈవెంట్లో జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి వంశీ కృష్ణ గంట వ్యవధిలోనే 4.238 కిలోమీటర్లు దాటి ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. 2002లో జాక్సన్ తన కాళ్ల మునివేళ్లతో వివిధ నృత్యరీతుల్లో వెనక్కి తిరిగిచూడకుండా గంట వ్యవధిలో 2.4 కి.మీ. మూన్‌వాక్ చేసి రికార్డు బద్దలు కొట్టాడు. గిన్నీస్ వారు పరిశీలించిన అనంతరం ఈ రికార్డు ను ధ్రువీకరీంచాల్సి ఉంటుంది. అయితే వంశీకృష్ణ కేవలం 33 నిమిషాల 4 సెకన్ల వ్యవధిలోనే 2.4 కి.మీ. దాటి రికార్డును తిరగరాశాడు. పాలమూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీనాథాచారి గిన్నిస్‌బుక్ నిర్వాహకులుగా వ్యవహరించారు. సరిగ్గా మధ్యాహ్నం 3.11 గంటలకు మూన్‌వాక్ ప్రారంభించిన వంశీకృష్ణ 4.11 గంటలకు ముగించాడు. అనంతరం వంశీ కృష్ణ మాట్లాడుతూ.. తాను మైకేల్ జాక్సన్‌కు వీరాభిమానినని, దీనికోసం ఎంతో సాధన చేశానని తెలిపారు. శనివారం జాక్సన్ జయంతి రోజున ఆయనకు ఇది తాను ఇచ్చిన నివాళి అని పేర్కొన్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా మానవపాడుకు చెందిన వంశీకృష్ణ కుటుంబం రంగారెడ్డి జిల్లా తాండూర్‌లో స్థిరపడింది. రికార్డు సృష్టించిన వంశీకృష్ణను మంత్రి సి.లక్ష్మారెడ్డి అభినందించారు.