
'ఆయనకు అదో అలవాటుగా మారింది'
'సూపర్ స్టార్ అయిన ఆమిర్ ఖాన్.. ప్రతీ అంశం మీద అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. అయితే అది ప్రజలందరిని దృష్టిలో ఉంచుకొని చేయాలి' అని బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ సూచించాడు. అమీర్ ఖాన్ తనకు మంచి మిత్రునిగా పేర్కొన్న ఆయన.. గతంలో ఆయనతో ఎన్నో చిత్రాలకు కలిసి పనిచేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
గతంలో 'దిల్', 'దిల్ హై కీ మంతా నహీ' చిత్రాలకు తనతో కలిసి పనిచేసినప్పుడు ఉన్న ఆమిర్ ఖాన్ ఇప్పటిలా లేడని, సంవత్సరాల పాటు ప్రయత్నించి ఆయన ఈ స్థాయికి చేరుకున్నాడన్నారు. ఇప్పుడు ఆయన ఏ విషయం మీద అయినా తన అభిప్రాయాలను తెలపాలనే క్రమంలో వివాదాస్పదంగా మాట్లాడుతున్నారన్నారు. స్టార్ డమ్ తోపాటు బాధ్యత కూడా వస్తుందని ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేలా కాకుండా వారిలో ఆశ నింపేలా మాట్లాడాలని సూచించాడు.
'గతంలో నేను చిత్రీకరించిన ఓ పాత్ర శుద్ద దండగ అని మహేశ్ బట్తో ఆమిర్ తెలిపినట్లు విన్నాను. అయితే కొంత మంది వ్యక్తులు మేము చెప్పేదే సరైనది, మిగతా ప్రపంచం మొత్తం తప్పు అని భావిస్తుంటారు' అని అనుపమ్ ఖేర్ తెలిపాడు