
మీ భార్యను ఈ ప్రశ్నలు అడిగారా?
న్యూఢిల్లీ: మత అసహనంపై ఆందోళన వ్యక్తం చేసిన బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ పై సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ పశ్నల వర్షం కురిపించారు. 'ఇండియా వదిలి వేరే దేశానికి వెళ్దామా?' అని తన భార్య కిరణ్ రావ్ అడిగిందని ఆమిర్ ఖాన్ వెల్లడించిన నేపథ్యంలో ట్విటర్ ద్వారా అనుపమ్ ఖేర్ పలు ప్రశ్నలు సంధించారు.
* 'నన్ను స్టార్ హీరోను చేసిన ఇండియాను వదిలి వెళ్లాలనుకుంటున్నావా' అని మీ భార్యను అడిగారా?
* గతంలో ఇంతకంటే గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఇండియా వదిలి వెళ్లాలనిపించలేదా అని కిరణ్ ను ప్రశ్నించారా?
* 'ఇంక్రెడిబుల్ ఇండియా' కాస్తా 7-8 నెలల కాలంలో మీకు 'ఇన్ టోలరెంట్ ఇండియా'గా ఎలా మారిందో చెప్పగలరా?
* దేశంలో మత అసహనం పెరిగిందని అంటున్నారు. దీని ద్వారా ప్రజలకు మీరు చెప్పదలుచుకున్నదేమిటి. ఇండియా వదిలి వెళ్లమంటారా? లేదా పరిస్థితులు చక్కబడేవరకు ఆగమంటారా?
* 'సత్యమేయ జయతే' కార్యక్రమం ద్వారా దేశంలోని సమస్యలను వెలుగులోకి తెచ్చారు. నేడు మత అసహనం పెరిగిందని చెబుతున్న మీరు ప్రజలకు భరోసా ఇచ్చేందుకు ప్రయత్నించాలి కానీ భయపెట్టకూడదు.
Dear @aamir_khan. Did you ask Kiran which country would she like to move out to? Did you tell her that this country has made you AAMIR KHAN.
— Anupam Kher (@AnupamPkher) November 23, 2015