‘ఇది ఎయిర్‌పోర్ట్ అరెస్ట్’
అనుపమ్ ఖేర్‌ను అడ్డుకున్న పోలీసులు
శ్రీనగర్ నిట్ క్యాంపస్‌కు వెళ్లకుండా ఆపివేత
న్యూడిల్లీ: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో వివాదం నేపథ్యంలో అక్కడి విద్యార్థులను కలిసేందుకు వెళ్లిన బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్‌ను జమ్మూకశ్మీర్ పోలీసులు శ్రీనగర్ విమానాశ్రయంలో అడ్డుకున్నారు. క్యాంపస్‌లో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయని, తిరిగి ఢిల్లీ వెళ్లాలని ఆయనకు చెప్పామని ఓ పోలీసు అధికారి తెలిపారు. తనను అడ్డుకోవడంపై ఖేర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘పోలీసులు కోరినట్లే శ్రీనగర్‌లోకి వెళ్లనన్నాను.
కానీ, నేను శ్రీనగర్‌లోకి ప్రవేశించకూడదని జారీ చేసిన ఆదేశాలను చూపించాలని అడిగాను’ అని ట్వీట్ చేశారు. తాను సమస్యలు సృష్టించేందుకు నిట్‌కు రాలేదని, విద్యార్థులను కలిసేందుకే వచ్చానన్నారు. ‘విద్యార్థులకు నైతిక స్థైర్యం ఇవ్వడానికి ఒక పౌరుడిగా వెళ్తున్నాను. వర్సిటీకి వెళ్లమని లక్షల మందికి చెప్తాను’ అని పేర్కొన్నారు. ‘కనీసం మా పూర్వీకుల ఇంటికి, లేకపోతే ఖీర్ భవానీ గుడికి వెళ్లేందుకు కూడా అనుమతించలేదు. ఇది ఎయిర్‌పోర్ట్ అరెస్ట్’ అని అన్నారు. ఢిల్లీకి తిరిగిరావడానికి ముందు ఎయిర్‌పోర్టులో త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు.