'సినిమాల కంటే.. నాకు దేశమే ముఖ్యం' | i importance nation than movies, says anupam kher | Sakshi
Sakshi News home page

'సినిమాల కంటే.. నాకు దేశమే ముఖ్యం'

Published Fri, Nov 6 2015 5:17 PM | Last Updated on Tue, Jun 4 2019 6:31 PM

'సినిమాల కంటే.. నాకు దేశమే ముఖ్యం' - Sakshi

'సినిమాల కంటే.. నాకు దేశమే ముఖ్యం'

న్యూఢిల్లీ: తనకు సినిమాల కంటే దేశమే ముఖ్యమని ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ అన్నారు. పరమత సహనం కోరుతూ శనివారం ఢిల్లీలో ప్రముఖులు నిర్వహిస్తున్న ర్యాలీలో అనుపమ్ ఖేర్ పాల్గొననున్నారు. ఈ యాత్రలో సినీ నటులు, మేధావులు, కవులు, కళాకారులు పాల్గొంటారు. ఇందులో పాల్గొనడం వల్ల తనకు సినిమాల్లో నటించే అవకాశాలు ఇవ్వకపోవచ్చని, వృత్తి కంటే తనకు దేశమే ముఖ్యమని అనుపమ్ ఖేర్ చెప్పారు.

 దేశంలో అసహనం పెరిగిపోతుందంటూ రచయితలు, మేధావులు తమకు లభించిన జాతీయ అవార్డులను వెనక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యానికి వచ్చిన ప్రమాదమేమీ లేదనీ, అవార్డులు వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేదంటూ అనుపమ్ ఖేర్ రాష్ట్రపతి భవన్కు ర్యాలీ నిర్వహించనున్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వానికి, పెరుగుతున్న అసహనానికి సంబంధం లేదంటూ ఈ ర్యాలీని నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement