ట్రాప్‌లో పడకు గంభీర్‌; సిగ్గుండాలి! | Anupam Kher Advice To Gautam Gambhir Over Gurugram Incident | Sakshi
Sakshi News home page

గంభీర్‌కు నటుడి సలహా; నెటిజన్ల ఫైర్‌

Published Wed, May 29 2019 10:22 AM | Last Updated on Wed, May 29 2019 2:27 PM

Anupam Kher Advice To Gautam Gambhir Over Gurugram Incident - Sakshi

ముంబై : మీడియాలో పాపులారిటీ సంపాదించుకోవడం కోసం కొంత మంది పన్నిన ఉచ్చులో పడవద్దని బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌.. బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌కు సూచించాడు. ఎంపీగా మీరు చేసే పనులు మాత్రమే మాట్లాడేలా నడుచుకుంటే బాగుంటుందంటూ సలహా ఇచ్చాడు.  జై శ్రీరాం అనాలంటూ ఓ ముస్లిం యువకుడిపై గురుగ్రామ్‌లో అల్లరిమూకలు దాడి చేసిన సంగతి తెలిసిందే. కాగా తూర్పు ఢిల్లీ ఎంపీ గంభీర్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు‌. నరేంద్ర మోదీ సబ్‌కా సాత్‌ , సబ్‌కా వికాస్‌, సబ్‌ కా విశ్వాస్‌తో తనకు లౌకికవాదంపై ఆలోచనలు పుట్టుకొచ్చాయని పేర్కొన్నారు. ఇకపై కులం, మతం పేరిట జరిగే దాడులన్నింటిపై గళమెత్తుతానని ట్విటర్‌ వేదికగా స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో గంభీర్‌ తీరుపై అనుపమ్‌ ఖేర్‌ స్పందించాడు. ‘ఎన్నికల్లో విజయం సాధించినందుకు శుభాకాంక్షలు గౌతం గంభీర్‌. ఓ భారతీయుడిగా మీ విజయం పట్ల నేనెంతో సంతోషంగా ఉన్నాను. మీరు అడగకున్నా సరే ఓ చిన్న సలహా ఇవ్వాలనుకుంటున్నా..ఓ వర్గంలో పాపులర్‌ అయ్యేందుకు కొంతమంది పన్నిన కుట్రలో చిక్కుకోకండి. మీరు ప్రకటనలు చేయాల్సిన పనిలేదు. మీరు చేసే పనులే మాట్లాడతాయి’ అంటూ ట్వీట్‌ చేశాడు. ఈ క్రమంలో.. అమానుష ఘటనపై వెంటనే స్పందించిన గంభీర్‌ను ట్రాప్‌లో పడేయాలని మీరే చూస్తున్నారు. ఆయనకు ఇంకా బీజేపీ నీళ్లు ఒంటబట్టలేదు. అయినా ఇటువంటి ఘటనపై ధైర్యంగా స్పందించిన గంభీర్‌ను మెచ్చుకోవాల్సింది పోయి.. ఇలాంటి ఉచిత సలహాలు ఇస్తారా. సిగ్గు పడాలి’ అంటూ నెటిజన్లు అనుపమ్‌ ఖేర్‌పై ఘాటు విమర్శలు చేస్తున్నారు. కాగా అనుపమ్‌ భార్య కిరణ్‌ ఖేర్‌ కూడా బీజేపీ ఎంపీ అన్న సంగతి తెలిసిందే. చండీగఢ్‌ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన ఆమె.. ఘన విజయం సాధించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement