
'కిరణ్ బేడీ ఢిల్లీ సీఎం అవుతారు'
జైపూర్: కిరణ్ బేడీ ముఖ్యమంత్రి అవుతారని బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈనెల 7న జరగనున్న ఢిల్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత కిరణ్ బేడీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడే అవకాశముందని అన్నారు. గోచ్చాలో జైపూర్ ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ ను ఆదివారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... కేంద్రంలో నరేంద్ర మోదీ పాలన చాలా బాగుందని కితాబిచ్చారు. మోదీ లాంటి ప్రధాని ఉండడం మన అదృష్టమన్నారు. గుర్మీత్ రామ్ రహీం సింగ్ వివాదస్పద సినిమా 'మెసేంజర్ ఆఫ్ గాడ్' గురించి మాట్లాడేందుకు అనుపమ్ ఖేర్ నిరాకరించారు.