వైరల్‌: నువ్వు మామూలు తల్లివి కాదమ్మా!.. | AnupamKher Posted Funny Indian Hacks In His Instagram | Sakshi
Sakshi News home page

వైరల్‌: నువ్వు మామూలు తల్లివి కాదమ్మా!..

Published Fri, Nov 1 2019 9:02 AM | Last Updated on Fri, Nov 1 2019 6:04 PM

AnupamKher Posted Funny Indian Hacks In His Instagram - Sakshi

పొట్టకు అడ్డంగా చెక్కపలక పెట్టుకున్న లావాటి మనిషి, బిడ్డను కిచెన్‌ కప్‌బోర్డు డ్రాయర్‌లో ఉంచిన తల్లి

కష్టం వచ్చినపుడు బాధపడుతూ కూర్చోవటం కంటే దానికి పరిష్కారం అన్వేషించటమే తెలివైన పని! అది ఎంత చిన్న కష్టమైనా. ఆ కష్టాన్ని ఎలా గట్టెక్కుతామన్న దాని మీదే మన తెలివి ఆధారపడి ఉంటుంది. మనం చేసే పనికి సృజనాత్మకత తోడైతే? అది కచ్చితంగా వైరల్‌ న్యూస్‌ అవుతుంది. ఈ కోణంలోనుంచి ఆలోచిస్తే భారతీయుల కంటే తెలివైన వాళ్లు, సృజనాత్మకంగా ఆలోచించేవాళ్లు లేరని చెప్పొచ్చు. ప్రముఖ బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన కొన్ని ఫొటోలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. పోస్ట్‌ అయిన గంటలోపే దాదాపు 26వేల లైకులతో పాటు వందల కామెంట్లు సొంతం చేసుకున్నాయి.

‘‘అత్యవసరాలను అధిగమించటానికి ఆవిష్కరణలు చేయటంలో భారతీయులే అత్యంత సృజనాత్మకమైన వాళ్లు. ఈ ఫొటోలు ఇందుకు నిదర్శనం’’ అని ఆయన పేర్కొన్నారు. అయితే ఫొటోలోని వ్యక్తుల చేష్టలు మనకు నవ్వు తెప్పించినా సమస్యను పరిష్కరించటానికి వారు చూపిన ప్రతిభను తప్పక గుర్తించి తీరాలి. లావాటి మనిషి కిందపడిపోకుండా పొట్టకు అడ్డంగా చెక్కపలక పెట్టుకుని నిద్రపోవటం, ఓ తల్లి తన బిడ్డను కిచెన్‌ కప్‌బోర్డు డ్రాయర్‌లో ఉంచి వంట చేసుకోవటం లాంటివి నెటిజన్లను ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. నువ్వు మామూలు తల్లివి కాదమ్మా!.. మన భవిష్యత్తు చూస్కోండి.. భారతీయులు ఎంతైనా తెలివైన వాళ్లు.’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి లైఫ్‌ హ్యాకింగులు కొత్త కాకపోయినా వెలుగులోకి వచ్చిన ప్రతిసారి నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement