
యంగ్ హీరో నిఖిల్; చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయకి సీక్వెల్‌గా వస్తున్న చిత్రం కార్తికేయ 2. ఈ మధ్యే విడుదలైన మోషన్ పోస్టర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సముద్రం దాచుకున్న అతిపెద్ద ప్రపంచ రహస్యం.. ఈ ద్వారకా నగరం అంటూ హీరో నిఖిల్ వాయిస్‌తో వచ్చిన ఈ మోషన్ పోస్టర్ ఆసక్తి రేపుతోంది. దీనిపై ఇస్కాన్ (అంతర్జాతీయ శ్రీకృష్ణ భక్తుల సమితి) వైస్ ప్రెసిడెంట్ రామ్‌రధన్ దాస్ కార్తికేయ 2పై ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలోని పాత్రలను పరిచయం చేశారు మేకర్స్.
ఇందులో కార్తికేయగా నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తుంటే.. ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు. అతి ముఖ్యమైన ధన్వంతరి పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కనిపిస్తుండగా.. శాంతనుగా ఆదిత్య మీనన్.. సదానందగా శ్రీనివాస్ రెడ్డి.. సులేమాన్ పాత్రలో వైవా హర్ష నటిస్తున్నారు. ఈ మేరకు ఫస్ట్ లుక్స్ కూడా విడుదల చేశారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్‌పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ జూలై 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
The World of #karthikeya2 is opening up… Teaser Coming soon ☺️
— Nikhil Siddhartha (@actor_Nikhil) June 10, 2022
India's epic mystical adventure🌟🔥
releasing on July 22nd @actor_Nikhil @anupamahere @AnupamPKher @harshachemudu @AdityaMenon22 @chandoomondeti @vishwaprasadtg @AbhishekOfficl @vivekkuchibotla @kaalabhairava7 pic.twitter.com/wHgMj4l72B
చదవండి: సీక్రెట్‌గా సింగర్ పెళ్లి, ఆపేందుకు ప్రయత్నించిన మాజీ భర్త
మాడవీధుల్లో చెప్పులేసుకుని తిరిగిన కొత్త పెళ్లికూతురు
Comments
Please login to add a commentAdd a comment