
బాలీవుడ్ స్టార్ హీరోలు ఆమిర్ ఖాన్ 'లాల్ సింగ్ చడ్డా', అక్షయ్ కుమార్ 'రక్షా బంధన్'.. రెండూ ఆగస్టు 11న రిలీజైన పెద్ద సినిమాలు. వీటి మధ్య పోటీ ఏమో కానీ వీటితో పోటీపడేందుకు ఆగస్టు 13న థియేటర్లలో రిలీజైంది కార్తికేయ 2. హిందీలో తొలిరోజు కేవలం 50 థియేటర్స్‌లో విడుదల చేస్తే అది ఆరో రోజు వచ్చేసరికి 1000 థియేటర్స్‌లలో విజయవంతంగా ఆడుతోంది.
భాష అనే బారికేడ్లను దాటుకుని ఘన విజయం సాధించింది. నేడు కృష్ణాష్టమి సందర్భంగా స్క్రీన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశమూ లేకపోలేదు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన కార్తికేయ 2 బాలీవుడ్‌లో ఇప్పుడు సంచలనంగా మారింది. ఇద్దరు బడా హీరోల సినిమాలను తొక్కేసి మరీ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. తెలుగు సినిమా సత్తాను చాటిన కార్తికేయ 2 చిత్రయూనిట్‌పై ప్రేక్షకులు, సినీప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment