Nikhil Siddhartha Karthikeya 2 Movie OTT Release Date: Check Streaming Platform - Sakshi
Sakshi News home page

Karthikeya 2 OTT Release: కార్తికేయ 2 ఈ ఓటీటీలోకే రాబోతోంది!

Published Thu, Aug 18 2022 3:17 PM | Last Updated on Thu, Aug 18 2022 3:28 PM

Nikhil Siddhartha starrer Karthikeya 2 to Stream on This OTT Platform - Sakshi

నిఖిల్‌ సిద్దార్థ్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన చిత్రం కార్తికేయ 2. మంచి విజయం సాధించిన కార్తికేయకు సీక్వెల్‌గా తెరకెక్కిందీ మూవీ. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను టి.జి. విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ సంయుక్తంగా నిర్మించారు. తెలుగుతో పాటు హిందీలోనూ విజయవంతంగా ఆడుతోందీ చిత్రం. లాల్‌ సింగ్‌ చడ్డా, రక్షాబంధన్‌ సినిమాలను వెనక్కు నెట్టి కార్తికేయ 2 హౌస్‌ఫుల్‌ రన్‌తో జైత్రయాత్ర సాగిస్తోంది. ఇప్పటికే డబుల్‌ బ్లాక్‌బస్టర్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ మూవీ ట్రిపుల్‌ బ్లాక్‌బస్టర్‌ దిశగా అడుగులు వేస్తుండటం విశేషం. ఇక ఐదురోజుల్లోనే రూ.38 కోట్లపైచిలుకు వసూళ్లు రాబట్టిన ఈ మూవీ ఓవర్సీస్‌లో వన్‌ మిలియన్‌ డాలర్‌ కొల్లగొట్టేదిశగా పయనిస్తోంది.

తాజాగా ఈ సినిమా ఓటీటీ హక్కులను జీ5 భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే థియేటర్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్న కార్తికేయ 2 ఇప్పుడప్పుడే ఓటీటీలో వచ్చేలా కనిపించడం లేదు. సుమారు 6 వారాల తర్వాతే ఓటీటీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

చదవండి: ఎట్టకేలకు కియారాతో డేటింగ్‌పై నోరు విప్పిన సిద్ధార్థ్‌, ఏమన్నాడంటే..
భారీ ఆఫర్‌ను వదులుకున్నా.. ఎమోషనల్‌ అయిన ఛార్మి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement