Anupam Kher Shares Mahima Chaudhry's Courageous Battle With Breast Cancer - Sakshi
Sakshi News home page

Mahima Chaudhary: బ్రెస్ట్‌ క్యాన్సర్‌ బారినపడ్డ మహిమ చౌదరి, ప్రకటించిన నటుడు

Published Thu, Jun 9 2022 2:26 PM | Last Updated on Thu, Jun 9 2022 4:46 PM

Anupam Kher Shares Mahima Chaudhry Courageous Battle With Breast Cancer - Sakshi

ప్రముఖ నటి మహిమ చౌదరి క్యాన్సర్‌ బారిన పడ్డారు. ఆమె బ్రెస్ట్‌ క్యాన్సర్‌కు చికిత్స తీసుకుందని నటుడు అనుపమ్‌ ఖేర్‌ వెల్లడించాడు. '‘నా 525వ చిత్రం ‘ద సిగ్నేచ’ర్‌లో ఓ కీ రోల్‌ కోసం నెల రోజుల క్రితం అమెరికా నుంచి మహిమకు కాల్ చేశాను. అప్పుడే తను బ్రెస్ట్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని బయటకు వెల్లడించడంలో నేను కూడా భాగం కావాలని ఆమె కోరుకుంది’’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్‌ చేశాడు. ఇందులో మహిమ.. క్యాన్సర్‌ వ్యాధితో తాను చేసిన పోరాటం గురించి వివరిస్తూ భావోద్వేగానికి లోనయింది. ‘మీ 525 సినిమాలో నటించాలని మీరు కాల్‌ చేసినప్పుడు నేను హాస్పిటల్‌ బెడ్‌పై ఉన్నాను. నా చుట్టూ డాక్టర్లు, నర్సులు ఉన్నారు. నా జుట్టు పూర్తి పోయింది. మీరు ఇప్పుడు కాల్‌ చేశారేంటి అనుకున్నాను. ఇంకా వెబ్‌ సిరీస్‌లు, సినిమాల్లో నటించాలని ఇంకా నాకు ఎన్నో కాల్స్‌ వచ్చాయి. నేను నటిస్తానని చెప్పలేను. ఎందుకంటే నా హెయిర్‌ మొత్తం లాస్‌ అయ్యింది’ అని చెప్పుకొచ్చింది. 

‘సాధారణ చెకప్‌ కోసం వెళ్లగా క్యాన్సర్‌ బయటపడింది. నాకు ఎలాంటి క్యాన్సర్‌ లక్షణాలు కూడా కనిపించలేదు. ​కానీ క్లారిటీ కోసం చెకప్‌కు వెళ్లాను. టెస్ట్‌ చేసిన డాక్టర్లు ఇది క్యాన్సర్‌ కణతి అయ్యుండొచ్చు అన్నారు. మీరు దీన్ని తీసేయాలనుకుంటున్నారా? అని అడిగారు. వద్దు వద్దు నేను జస్ట్‌ చెకప్‌ కోసం వచ్చాను అన్నాను. చివరకు బయాప్సీ చేసి కణతి తీసి టెస్ట్‌ చేయగా క్యాన్సర్‌గా తేలింది. ఆ తర్వాత కీమోలు ఇస్తున్న సమయంలో చాలా నీరసించి పోయాను. ఎనర్జీ లాస్‌ అయ్యాను. నా హెయిర్‌ పోయింది. కానీ ధైర్యంతో ఈ వ్యాధిని ఎదుర్కొన్నాను. ప్రస్తుతం నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను’ అని వివరించింది. కాగా క్యాన్సర్‌పై ఎంతో మంది మహిళలకు అవగాహన కల్పించేందుకు మహిమ తనని కూడా భాగం చేశారని అనుపమ్‌ ఖేర్‌ చెప్పుకొచ్చాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement