సోనియా గాంధీగా ఈమెనే! | Meet The German Actress Who Will Play Sonia Gandhi On Big Screen | Sakshi
Sakshi News home page

సోనియా గాంధీగా ఈమెనే!

Published Fri, Apr 6 2018 1:09 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

Meet The German Actress Who Will Play Sonia Gandhi On Big Screen - Sakshi

న్యూఢిల్లీ : దేశ మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ జీవిత ఆధారంగా ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’  చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సంజయ్‌బారు రాసిన పుసక్తం ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా కు సంబంధించిన స్టిల్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. అనుపమ్‌ కేర్‌ ఈ సినిమాలో డా.మన్మోహన్‌ సింగ్‌గా కీలక పాత్ర పోషిస్తున్నారు. మరో కీలక పాత్ర అయిన కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీగా ఎవరు నటిస్తున్నారని సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ ఉత్కంఠకు తెరదించుతూ.. సోనియా గాంధీగా తాను బిగ్‌ స్క్రీన్‌పై  నటిస్తున్నట్టు జర్మన్‌ నటి సుజానే బెర్నెర్ట్‌ ట్విటర్‌లో ధృవీకరించారు.

పలు భారతీయ సినిమాల్లో, పలు భాషల టీవీ షోల్లో నటించిన బెర్నెర్ట్‌, నటుడు అఖిల్‌ మిశ్రాను పెళ్లి చేసుకున్నారు. ఆమె బెంగాలీ, మరాఠి, హిందీ భాషలను అనర్గళంగా మాట్లాడగలరని తెలుస్తోంది. అంతకముందు ‘ప్రధానమంత్రి’  టెలివిజన్‌ సిరీస్‌లో కూడా కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలిగా ఆమె నటించారు. తన తర్వాత ప్రాజెక్ట్‌ సోనియా గాంధీ అని సుజానే బెర్నెర్ట్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. విజయ్‌ గుట్టే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుపమ్‌ ఖేర్‌తో పాటు అక్షయ్ ఖన్నా కూడా నటిస్తున్నారు. డిసెంబర్‌ 21న ఈ సినిమా విడుదల కాబోతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement