The Accidental Prime Minster
-
‘అందుకే ఇలాంటి సినిమాలు తీస్తున్నారు’
సాక్షి, విజయవాడ : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ యాక్సిడెంటల్ ప్రధాని కాదని, అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్‌ను నిలిపిన స్పృహ కలిగిన గొప్ప ప్రధాని అని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ... ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్‌మినిస్టర్’ సినిమా ట్రైలర్ మన్మోహన్ సింగ్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఉన్న ఆర్థిక నిపుణుల్లో మన్మోహన్ సింగ్ ఒకరు.. 4 శాతం పడిపోయిన దేశ జీడీపీనీ 7 శాతానికి తెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందని పేర్కొన్నారు. రుణమాఫీతో పాటు అనేక కీలక చట్టాలు మన్మోహన్ సింగ్ పాలనా సమయంలోనే వచ్చాయని గుర్తుచేశారు. తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతూ... ‘ ప్రధాన మంత్రి పదవి కాదు కదా కనీసం కేంద్ర మంత్రి పదవి కూడా వద్దని, తాను ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయని చెప్పిన వ్యక్తి రాహుల్’ అని వ్యాఖ్యానించారు. ఆయన భార్య బీజేపీ ఎంపీ ఈ సినిమాలో మన్మోహన్ సింగ్ పాత్రధారి అనుపమ్ ఖేర్ గురించి ప్రస్తావిస్తూ.... అనుపమ్, నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఫిల్మ్ అండ్ టెలివిజన్ సంస్థ చైర్మన్ గా పని చేశారని రఘువీరా గుర్తుచేశారు. అనుపమ్ ఖేర్ భార్య కిరణ్ ఖేర్ ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్నారని.. ఓటమి భయంతోనే బీజేపీ ఇలాంటి సినిమాలు తీసుకువస్తోందని విమర్శించారు. సెన్సార్ బోర్డ్ ఈ సినిమా విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. అయినా 2019 ఎన్నికల్లో ఈ సినిమా ప్రభావం ఎంతమాత్రం ఉండబోదని జోస్యం చెప్పారు. ఏపీ ప్రభుత్వం వెంటనే స్పందించాలి అగ్రిగోల్డ్ వ్యవహారంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. విభజన హామీల అమలు ఇప్పటికే ఆలస్యమైందని.. హైకోర్టు విభజన అనేది వ్యక్తుల కోసం జరగదని పేర్కొన్నారు. ఈ విషయంలో తమ పార్టీకి స్పష్టమైన విధానం ఉందని తెలిపారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తోందని గుర్తు చేశారు. -
మరి యాక్సిడెంటల్ సీఎం ఎవరో?!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా బాలీవుడ్లో తెరకెక్కుతున్న ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్‌మినిస్టర్’ సినిమా ట్రైలర్‌పై దుమారం రేగుతోంది. గురువారం విడుదలైన ఈ ట్రైలర్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. మన్మోహన్ సింగ్‌ను ముందుపెట్టి కాంగ్రెస్ పది సంవత్సరాల పాటు దేశాన్ని దోచుకున్న తీరుకు ఇది నిదర్శనం అని పలువురు బీజేపీ నేతలు వ్యాఖ్యనించగా, నాలుగున్నరేళ్ల వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీ ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక బీజేపీ చేసిన ట్వీట్... జేడీఎస్- బీజేపీ అభిమానుల మధ్య చిచ్చు రాజేస్తోంది. మరి యాక్సిడెంటల్ సీఎం ఎవరు? ‘ ఒకవేళ యాక్సిడెంటల్ సీఎం అనే సినిమా తెరకెక్కితే.. ఆ పాత్రను ఎవరు పోషిస్తారు.. హెచ్డీ కుమారస్వామేనా’ అని ట్వీట్ చేసిన కర్ణాటక బీజేపీ.. సీఎం కుమారస్వామిని ట్యాగ్ చేసింది. ఈ క్రమంలో... ‘కుమారస్వామి, ఆయన తండ్రి మంచి నటులు... వాళ్లకు ఉన్నదంతా ఇటాలియన్ మాఫియా చేతిలో పెట్టారు’ అని ఒకరు కామెంట్ చేయగా... ‘ఒకవేళ చెక్సీఎం అనే సినిమా తీస్తే.. యడ్యూరప్ప ఆ పాత్ర పోషిస్తారా’ అంటూ మరొకరు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. If there was a movie titled #AccidentalCM who will play the role of @hd_kumaraswamy ? — BJP Karnataka (@BJP4Karnataka) December 29, 2018 కాగా దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 103 స్ధానాల్లో గెలుపొందిన బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించగా.. కాంగ్రెస్ 78 స్ధానాలను హస్తగతం చేసుకుంది. ఈ క్రమంలో 37 స్థానాలు గెలుచుకున్న జేడీఎస్‌తో కూటమిగా ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జేడీఎస్ అధినేత హెచ్డీ కుమారస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. -
‘తనే నా హీరో’
సోనాలీ బింద్రే ప్రస్తుతం క్యాన్సర్ చికిత్స కోసం న్యూయార్క్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా ఒక షో షూటంగ్ నిమిత్తం న్యూయార్క్‌లో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన సోనాలీని కలిశారు. ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ ‘నేను సోనాలీతో కలిసి కొన్ని చిత్రాల్లో నటించాను. బయట కూడా చాలాసార్లు తనని కలిశాను. తనేప్పుడు నవ్వుతూ.. ప్రశాంతంగా ఉండేది. కానీ నేను ఇన్ని రోజుల చూసిన సోనాలీకి.. ఓ 15 రోజులుగా చూస్తోన్న సోనాలీకి చాలా తేడా ఉంది. ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్పగలను ‘తనే నా హీరో’ అని’ అంటూ ట్వీట్ చేశారు. I have done few films with @iamsonalibendre. We’ve met socially many times in Mumbai. She always has been bright & a very warm person. But it is only in the last 15days that I got the opportunity to spend some quality time with her in NY. And I can easily say,”She is my HERO.”😍 pic.twitter.com/z6iBe2s7fy — Anupam Kher (@AnupamPKher) August 12, 2018 ట్వీట్‌తో పాటు చికిత్సకు ముందు సోనాలీ జుట్టు కత్తిరించుకుని ఉన్నప్పుడు తీసిన ఫోటోను కూడా అనుపమ్ ఖేర్ షేర్ చేశారు. గతంలో వీరిద్దరు కలిసి ‘హమరా దిల్ ఆప్నే పాస్ హై’, ‘దిల్ హై దిల్ మైనే’,‘ధాయ్ అక్షర్ ప్రేమ్ కే’ వంటి చిత్రాల్లో కలిసి నటించారు. ప్రస్తుతం అనుపమ్ ఖేర్ వైద్య నేపధ్యంలో సాగే డ్రామా ‘న్యూ ఆమస్టర్డ్యామ్’ చిత్రకరణ నిమిత్తం న్యూయార్క్‌లో ఉన్నారు. ప్రస్తుతం అనుపమ్ ఖేర్, బాలీవుడ్లో ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ చిత్రంలో నటిస్తున్నారు. విజయ్ రత్నాకర్ గట్టీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బొహ్రా బ్రదర్స్ నిర్మిస్తున్నారు. సలీమ్-సలైమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 2019 ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్ 21న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
సోనియా గాంధీగా ఈమెనే!
న్యూఢిల్లీ : దేశ మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ జీవిత ఆధారంగా ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సంజయ్‌బారు రాసిన పుసక్తం ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా కు సంబంధించిన స్టిల్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. అనుపమ్ కేర్ ఈ సినిమాలో డా.మన్మోహన్ సింగ్‌గా కీలక పాత్ర పోషిస్తున్నారు. మరో కీలక పాత్ర అయిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీగా ఎవరు నటిస్తున్నారని సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ ఉత్కంఠకు తెరదించుతూ.. సోనియా గాంధీగా తాను బిగ్ స్క్రీన్‌పై నటిస్తున్నట్టు జర్మన్ నటి సుజానే బెర్నెర్ట్ ట్విటర్లో ధృవీకరించారు. పలు భారతీయ సినిమాల్లో, పలు భాషల టీవీ షోల్లో నటించిన బెర్నెర్ట్, నటుడు అఖిల్ మిశ్రాను పెళ్లి చేసుకున్నారు. ఆమె బెంగాలీ, మరాఠి, హిందీ భాషలను అనర్గళంగా మాట్లాడగలరని తెలుస్తోంది. అంతకముందు ‘ప్రధానమంత్రి’ టెలివిజన్ సిరీస్‌లో కూడా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలిగా ఆమె నటించారు. తన తర్వాత ప్రాజెక్ట్ సోనియా గాంధీ అని సుజానే బెర్నెర్ట్ ట్విటర్లో పేర్కొన్నారు. విజయ్ గుట్టే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుపమ్ ఖేర్‌తో పాటు అక్షయ్ ఖన్నా కూడా నటిస్తున్నారు. డిసెంబర్ 21న ఈ సినిమా విడుదల కాబోతోంది. -
మన్మోహన్ వస్తున్నారు
దేశ ప్రధానమంత్రిగా 2004 నుంచి 2014 వరకు బాధ్యతలు నిర్వర్తించారు డా. మన్మోహన్సింగ్. ఈ పదేళ్లలో ఆయనను కొందరు ప్రశంసించారు. మరికొందరు విమర్శించారు. పదవీకాలం ముగిసిపోయే సమయంలో ఆయన జీవితంపై ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ అనే పుస్తకం విడుదల అయ్యింది. 2004 మే నుంచి 2008 ఆగస్టు వరకు మన్మోహన్‌సింగ్‌కు మీడియా అడ్వైజర్‌గా వర్క్ చేసిన సంజయ్‌బారు ఈ పుస్తకం రాయడం విశేషం. ఈ పుస్తకం ఆధారంగా బాలీవుడ్లో రూపొందుతున్న సినిమా‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’. విజయ్ గుట్టే దర్శకత్వం వహిస్తున్నారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ పాత్రలో అనుపమ్ ఖేర్ నటిస్తున్నారు. బోహ్రా బోస్ నిర్మాత. ఈ సినిమా ఫస్ట్ లుక్స్‌ను రిలీజ్ చేశారు. ‘‘సినిమాలో డా. మన్మోహన్ సింగ్ లుక్‌ని షేర్ చేయడం హ్యాపీగా ఉంది’’ అని అనుపమ్ పేర్కొన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 21న చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. మరోవైపు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో షారుక్ ఖాన్, కత్రినా కైఫ్, అనుష్కాశర్మ ముఖ్య తారలుగా నటిస్తున్న ‘జీరో’ చిత్రాన్ని ఇదే రోజున రిలీజ్ చేయాలనుకుంటున్నారు. సో.. బాక్సాఫీస్ వద్ద క్లాష్ తప్పదన్న మాట. -
నో అబ్జెక్షన్ అంటారా?
సెన్సార్ సర్టిఫికెట్ కోసం సెన్సార్ బోర్డ్‌కి సినిమా చూపించినప్పుడు కొన్ని సినిమాలకు చిక్కులు వస్తుంటాయి. మాజీ ప్రధాని మనోహ్మన్‌సింగ్ జీవిత కథ ఆధారంగా అనుపమ్ ఖేర్ లీడ్ రోల్ చేస్తున్న ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ చిత్రానికి షూటింగ్ పూర్తవక ముందే సెన్సార్ సమస్యలు ఎదురయ్యాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన వెంటనే సెంట్రల్ సెన్సార్ బోర్డ్ చైర్మన్ పహ్లాజ్ నిహ్లానీ స్పందించారు. ‘‘మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ బయోపిక్‌లో అనుపమ్ ఖేర్ నటించడం ఆనందించదగ్గ విషయమే. అయితే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మన్మోహన్సింగ్ల నుంచి ‘నో అబ్జెక్షన్’ సర్టిఫికెట్స్‌ను ఈ సినిమా మేకర్స్ సెన్సార్ బోర్డుకు సమర్పించవలసి ఉంటుంది. 2018 జనవరిలో నా పదవీ విరమణ ఉంటుంది. ఈ చిత్రం అప్పటికి సెన్సార్‌కు రాకపోవచ్చు. అయితే ఇప్పటి ఈ రూల్స్‌లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని అనుకుంటున్నాను’’ అన్నారు పహ్లాజ్. మన్మోహన్సింగ్ ప్రధానిగా ఉన్న టైమ్‌లో మీడియా సలహాదారులు సంజయ్ బారు రచించిన ‘ది యాక్సిడెంటల్ ప్రెమ్మినిస్టర్: ది మేకింగ్ అండ్ అన్‌మేకింగ్ ఆఫ్ మన్మోహన్సింగ్’ పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు హన్సల్ మెహతా రచయిత కాగా, విజయ్ రత్నాకర్ గుట్టే దర్శకత్వం వహిస్తున్నారు. అయితే సెన్సార్ బోర్డ్ సభ్యులు అశోక్ పండిట్ ఈ చిత్రానికి కో–ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తుండటం విశేషం. ఆ సంగతలా ఉంచితే, సోనియా, మన్మోహన్ ‘నో అబ్జెక్షన్’ సర్టిఫికెట్స్ ఇస్తారా? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాను 2019 ఎన్నికల సమయానికి రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తుందని బాలీవుడ్ టాక్.