
ఈ మధ్యకాలంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న నటులలో ప్రకాష్ రాజ్ ఒకరు. ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా పేరొందిన ప్రకాష్ రాజ్.. దేశంలోని ప్రస్తుత రాజకీయాలపై తనదైన శైలిలో సెటైర్స్ వేస్తున్నాడు. కొంతకాలంగా మోడీ ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ పోస్టులు పెడుతున్నాడు. అయితే.. గతంలో ప్రభుత్వంపై స్పందించిన బాలీవుడ్ ప్రముఖులు ప్రస్తుతం మౌనం వహించడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన చేసిన ఓ ట్వీట్ చర్చనీయాంశమైంది. ఇందులో కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి, బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, శిల్పాశెట్టి, జూహీ చావ్లా, అనుపమ్ ఖేర్ ట్వీట్స్‌కు సంబంధి స్క్రీన్ షాట్స్ ఉండటంలో హాట్‌టాపిక్‌గా నిలిచింది.
ఇందులో ‘సంతోషం పెట్రోల్ ధరలా తరహాలో పెరగాలి.. బాధలు ఇండియన్ రూపీలాగా తగ్గాలి. హృదయం కరప్షన్ తరహాలో జాయ్‌తో నిండిపోవాలి’ అంటూ వివేక్ అగ్నిహోత్రి గతంలో చేసిన ఈ ట్వీట్ అప్పుట్లో తీవ్ర రచ్చకు దారి తీసింది. ఇక శిల్పా శెట్టి డాలర్ రేటు పెరుగుతూ ఉండడం పై సెటైర్ వేసింది. అలా అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్‌లతో పాటు నటి జూహి చావ్లా సైతం రూపాయి విలువను లో దుస్తులతో పోల్చడం వివాదాస్పదంగా మారింది. అయితే ఈ ట్వీట్స్ 2012,13 చేసినవి కావడం గమనార్హం. ఈ ట్వీట్స్‌కు సంబందించిన స్క్రీన్ షాట్స్‌కు ప్రకాశ్ రాజ్ ‘ఒకప్పుడు దేశంలో’ అంటూ జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్‌ను జత చేసి పోస్ట్ చేశాడు. ఏదేమైన ప్రకాశ్ రాజ్ తాజా ట్వీట్ మాత్రం బాలీవుడ్‌తో పాటు సౌత్‌లో హాట్‌టాపిక్ నిలిచింది.
Once upon a time…in my country.. #justasking pic.twitter.com/KOgkQwQwAy
— Prakash Raj (@prakashraaj) July 20, 2022