ది కశ్మీర్ ఫైల్స్.. చిన్న సినిమా కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. పెద్దగా ప్రమోషన్లు చేయకపోయినా బాక్సాఫీస్‌పై వసూళ్లతో విరుచుకుపడుతోంది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటివరకు అక్షరాలా రూ.60 కోట్లు రాబట్టింది. ఈ విషయాన్ని ట్రేడ్ గురు తరణ్ ఆదర్శ్ సోషల్ మీడియాలో వెల్లడించాడు.
'ది కశ్మీర్ ఫైల్స్ బాక్సాఫీస్ సునామీగా, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రోజురోజుకీ వసూళ్లు పెరుగుతున్నాయి. సినిమా రిలీజైన తొలి(మార్చి 11) రోజు మూడున్నర కోట్లు వచ్చాయి. రెండో రోజు రూ.8.50 కోట్లు, మూడో రోజు రూ.15.10 కోట్లు, నాలుగో రోజు రూ.15.05 కోట్లు వచ్చాయి. ఇక ఐదో రోజు(మంగళవారం నాడు) ఏకంగా రూ.18 కోట్లు రాబట్టింది. మొత్తంగా రూ.60.20 కోట్ల కలెక్షన్లు వచ్చాయి' అని తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. కలెక్షన్ల స్పీడ్ చూస్తుంటే త్వరలోనే వందకోట్లు కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. 1990లో కశ్మీర్ పండిట్‌లపై సాగిన సాముహిక హత్యాకాండను కళ్లకు కట్టినట్లు చూపించిన సినిమా 'ది కశ్మీర్ ఫైల్స్'. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో నటించడగా దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి కీలక పాత్రల్లో నటించారు.
#TheKashmirFiles is a TSUNAMI at the #BO… FANTASTIC TRENDING, as footfalls, occupancy, numbers continue to soar… Day 5 higher than *all* previous days… BLOCKBUSTER... Fri 3.55 cr, Sat 8.50 cr, Sun 15.10 cr, Mon 15.05 cr, Tue 18 cr. Total: ₹ 60.20 cr. #India biz. pic.twitter.com/uaDH3ooVsO
— taran adarsh (@taran_adarsh) March 16, 2022
చదవండి: ఓటీటీలోకి ‘ది కశ్మీర్ ఫైల్స్’, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Comments
Please login to add a commentAdd a comment