బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ప్రస్తుతం ప్రభాస్ తీస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలోనివే. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ ఖాతాలో ఓ భారీ హిట్ మాత్రం పడలేదు. భారీ అంచనాల మధ్య వచ్చిన ‘ఆదిపురుష్’ కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇక ప్రభాస్‌తో పాటు అతని ఆభిమానుల ఆశలన్నీ ‘సలార్’పైనే ఉన్నాయి. కేజీయఫ్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. ఇటీవల విడుదలైన టీజర్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.
ఈ టీజర్‌లో క్యారెక్టర్‌ని ‘ది మోస్ట్ వయొలెన్స్ మ్యాన్’గా పరిచయం చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్‌లో దూసుకెళ్తుంది. అభిమానులతో పాటు చాలా మంది సినీ ప్రముఖులు సైతం టీజర్‌ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కానీ ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి మాత్రం టీజర్‌తో పాటు ప్రభాస్‌ని విమర్శించాడు. అయితే ఈ విమర్శలు పరోక్షంగా చేయడం గమనార్హం. ప్రభాస్ పేరు ఎత్తకుండా కొందరికి యాక్టింకే రాని వాళ్లని పాన్ ఇండియా స్టార్ అంటున్నారని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
(చదవండి: స్టార్ హీరోపై ఆరోపణలు.. రూ.10 కోట్ల పరువునష్టం కేసు!)
‘ఎవరు పుట్టుకతోనే హింసాత్మకంగా మారారు. మీ పిల్లల మనసులను శాంతివైపు నడిపించండి. ప్రస్తుత కాలంలో హింసను గ్లామరైజ్ చేయడం ఫ్యాషన్ ఐపోయింది. సినిమాల్లో మితిమీరిన హింసని చూపించడం, అలాంటి సినిమాలను ప్రమోట్ చేయడం, అసలు నటులే కాని వాళ్ళను బిగ్గెస్ట్ స్టార్స్ అని చెప్పుకోవడం పెద్ద టాలెంట్ అనుకుంటున్నారు. ఆలాంటి వారికి ఫ్యాన్స్ అని చెప్పుకునే వారికి కూడా అసలు ఏమీ తెలియదని అర్థం చేసుకోవాలి’ అని పరోక్షంగా ప్రభాస్‌ని విమర్శిస్తూ ట్వీట్ చేశాడు. వివేక్. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు.
Now glamourising extreme violence in cinema is also considered talent. Promoting nonsense cinema is considered a bigger talent. Promoting a non-actor as biggest star is considered biggest talent. And assuming audience is super-dumb is mother of all talent. https://t.co/hTJnLjJGYb
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) July 6, 2023
Comments
Please login to add a commentAdd a comment