Vivek Agnihotri Tweet on Congress Leader Rahul Gandhi Suspension - Sakshi
Sakshi News home page

Vivek Agnihotri: అదే రుజువైంది.. ది కశ‍్మీర్ ఫైల్స్ దర్శకుడు సంచలన ట్వీట్

Published Mon, Mar 27 2023 7:50 PM | Last Updated on Mon, Mar 27 2023 8:10 PM

Vivek Agnihotri Tweet On Congress Leader Rahul Gandhi Suspension - Sakshi

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీపై కశ్మీర్‌ ఫైల్స్ దర్శకుడు సంచలన ట్వీట్ చేశారు. పార్లమెంట్‌లో రాహుల్‌పై అనర్హత వేటుపై వ్యంగ్యంగా స్పందించారు. ప్రస్తుతం వివేక్ అగ్నిహోత్రి చేసిన ట్వీట్ నెట్టింట తెగ వైరలవుతోంది. ఇంతకీ ఆ ట్వీట్‌లో ఏముందో చూద్దాం.

రాహుల్‌ గాంధీపై దాఖలైన పిటిషన్‌పై సూరత్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.  కర్ణాటకలోని కోలార్‌లో ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై రెండేళ్ల జైలు శిక్షపడింది. ఈ నేపథ్యంలో లోక్‌సభ సభ్యత్వం రద్దయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మోదీ ఇంటి పేరు ఉన్న వారందరూ దొంగలు అని రాహుల్ చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. తాజాగా వివేక్ అగ్నిహోత్రి ట్వీట్ కాంగ్రెస్‌లో కలకలం సృష్టిస్తోంది. 

ది కశ్మీర్‌ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ట్వీట్ చేస్తూ.. 'రాజకీయాల్లో అర్హత లేని నేత రాహుల్ గాంధీ. అయితే ప్రస్తుతం అది అధికారికంగా రుజువైంది.' అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. అంతే కాకుండా గతంలో ఇందిరాగాంధీపై కూడా అనర్హత వేటు పడిందని ఆయన గుర్తు చేశారు. అయితే ఆమె నిజాయితీ గల నేత కాబట్టి తిరిగి అగ్రనేతగా నిలదొక్కుకున్నారని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ నాయకత్వలేమితో కొట్టుమిట్టాడుతోంది. పార్టీ తిరిగి పుంజుకునే అవకాశం కనిపించడం లేదన్నారు. అయితే ఇందిరా గాంధీ కనక కశ్మీర్‌ను కాపాడి ఉంటే.. తాను కశ్మీర్ ఫైల్స్ సినిమా తీసేవాడిని కాదు అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement