ప్రభాస్ ఫ్యాన్స్ నన్ను బెదిరిస్తున్నారు: స్టార్ డైరెక్టర్ | Director Vivek Agnihotri Comments On Prabhas Fans - Sakshi
Sakshi News home page

Vivek Agnihotri: అప్పుడు చిల్లర కామెంట్స్.. ఇప్పుడేమో ఇలా!

Sep 26 2023 7:08 PM | Updated on Sep 26 2023 8:06 PM

Director Vivek Agnihotri Comments On Prabhas Fans - Sakshi

డార్లింగ్ హీరో ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఇప్పుడు ఉన్నదంతా ఒకటే టెన్షన్. 'సలార్' ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని మాత్రమే ఆలోచిస్తున్నారు. ఇలాంటి టైంలో డార్లింగ్ అభిమానులపై ఓ స్టార్ డైరెక్టర్ కాంట్రవర్సీ కామెంట్స్ చేశాడు. తనని వాళ్లు బెదిరిస్తున్నారని చెప్పుకొచ్చాడు. ఇంతకీ అసలేం జరిగింది? ఎవరా దర్శకుడు?

ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో తీసిన సినిమా 'సలార్'. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ శుక్రవారం.. అంటే సెప్టెంబరు 28న థియేటర్లలోకి వచ్చేయాలి. కానీ పోస్ట్ ప్రొడక్షన్స్ లేట్ కావడం వల్ల వాయిదా పడింది. అదే రోజున 'ద వ్యాక్సిన్ వార్' అనే హిందీ సినిమా రిలీజ్ అవుతోంది. కనీసం ఇది వస్తున్నట్లు ఎవరికీ తెలియట్లేదు. పట్టించుకోవట్లేదు కూడా. దీంతో ఈ చిత్ర డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రికి ఏం చేయాలో అర్థం కావడం లేదనుకుంటా! పిచ్చి కామెంట్స్‍‌తో హైప్ తెచ్చుకోవాలని చూస్తున్నాడు.

(ఇదీ చదవండి: నిత్యామేనన్‌ని వేధించిన ఆ హీరో.. అసలు నిజమేంటి?)

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనని ప్రభాస్ ఫ్యాన్స్ బెదిరిస్తున్నారని, తన కూతురిపైనా అసభ్యకర రీతిలో ట్రోల్స్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఒకటుంది. గతంలో ఇదే దర్శకుడు.. ప్రభాస్‌కి అస్సలు యాక్టింగే రాదని, సలార్ టీజర్ చెత్తలా ఉందని పిచ్చి కూతలు కూశాడు. 'సలార్' పోటీగా తమ సినిమా రిలీజ్ చేస్తున్నామని, భయపడేది లేదని అన్నాడు.

దీంతో ప్రభాస్ ఫ్యాన్స్‌కి మండింది. ఆ ఊపులోనే డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రిపై ట్రోల్ చేసినట్లు ఉన్నారు. దాన్ని ఇన్ని రోజులు బయటపెట్టకుండా.. తన సినిమాకు హైప్ లేకపోయేసరికి ఇప్పుడు చెబుతున్నాడు. తన మూవీ రిలీజ్‌కి మరో రెండు రోజుల ఉందనగా చెప్పడం విడ్డూరంగా అనిపించింది. 'ద కశ్మీర్ ఫైల్స్' చిత్రంతో హిట్ కొట్టిన ఈ దర్శకుడు.. 'ద వ్యాక్సిన్ వార్'తో ఏం చేస్తాడనేది మరో రెండు రోజుల్లో తెలిసిపోతుందిలే! అలానే ఇదంతా చూస్తుంటే ప్రభాస్ ఇమేజ్ చెడగొట్టేందుకు ఈ దర్శకుడు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నాడా అనే డౌట్ కూడా వస్తోంది.

(ఇదీ చదవండి: సాయితేజ్-స్వాతి.. ఆ విషయం ఇప్పుడు బయటపెట్టారు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement