
చిన్న సినిమాగా వచ్చి పెను సంచలన విజయం సాధించింది ది కశ్మీర్ ఫైల్స్. మార్చి 11న రిలీజైన ఈ సినిమా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ సినిమాపై ఎందరో ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కశ్మీర్ ఫైల్స్ సినిమాను అభినందించాడు. భోపాల్‌లోని ఓ కార్యక్రమంలో అక్షయ్ మాట్లాడుతూ.. 'వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన కశ్మీర్ ఫైల్స్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. విచిత్రమేంటంటే దీని ఎఫెక్ట్ నా సినిమాపై కూడా పడింది. నేను నటించిన బచ్చన్ పాండే కలెక్షన్లను కశ్మీర్ ఫైల్స్ దెబ్బకొట్టింది' అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా వివేక్ అగ్నిహోత్రి దాన్ని ట్విటర్‌లో షేర్ చేశాడు. తన సినిమాపై ప్రశంసలు కురిపించిన అక్షయ్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలియజేశాడు.
కాగా కశ్మీర్ ఫైల్స్‌లో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి, దర్శన్ కుమార్, చిన్మయి, భాషా సుంబ్లి తదితరులు నటించారు. ఈ సినిమాకు ఉత్తరప్రదేశ్, గోవా, త్రిపుర, హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వినోద పన్ను మినహాయించారు. త్వరలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ డబ్ చేసి అందుబాటులోకి తీసుకురానున్నారు.
కశ్మీర్ ఫైల్స్ నా సినిమాను దెబ్బకొట్టింది.
Thanks @akshaykumar for your appreciation for #TheKashmirFiles. 🙏🙏🙏 pic.twitter.com/9fMnisdDzR
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) March 25, 2022
Comments
Please login to add a commentAdd a comment